ఇంకో పాదయాత్ర ప్రారంభించనున్న షర్మిల.. చంద్రబాబు గజగజ..?

Suma Kallamadi

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల వచ్చే ఏడాది మరో పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఒకచోట కూర్చోలేకపోతున్నారు. అన్ని అబద్ధపు హామీలు ఇవ్వడం, ఏ పని చేయకుండా కాలం గడిపే చంద్రబాబే అధికారంలోకి వచ్చారు తాను ఎందుకు రాలేము అనే నమ్మకం ఆమెలో పెరిగిపోయినట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికల వరకు రాజకీయ వర్గాల్లో తన విజిబిలిటీని కొనసాగించాలని ఆమె ఆలోచిస్తున్నారు. జగన్ ఎలాగో ఇన్ ఎఫెక్ట్ లీడర్ గా ప్రూవ్ చేసుకున్నారు.

 అభివృద్ధి చేయకపోవడం కరెంట్ బిల్లు పెంచడం, ఆల్కహాల్ ధరలు కూడా పెంచడం జగన్ పెద్ద మైనస్ అయ్యింది. చంద్రబాబు హామీలు ఇచ్చారు కానీ వాటిని అమలు చేసే డబ్బులు లేవంటూ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించారు. ఇలాంటి అబద్ధపు అసమర్ధ నేతలు ఉన్న ఏపీలో తాను సీఎం అయ్యే అవకాశం ఉందని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఓ ఎత్తుగడను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర ప్రారంభించారు. అదేవిధంగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించి రెండు దశల్లో పూర్తి చేశారు. అయితే షర్మిల తన పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఓట్లను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చేసారి ఎలాగైనా ఎక్కువ ఓట్లతో విజయం సాధించాలని ఆమె ప్లాన్ చేశారు. ఇప్పటినుంచే పార్టీ పునాదిని పటిష్టం చేసుకోవడం ద్వారా కింది స్థాయిలో కూడా బలమైన ఉనికిని పొందవచ్చు.

వైసీపీ నేతల మద్దతు, ప్రజల విశ్వాసం పొందాలంటే పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం అవసరమని షర్మిల అభిప్రాయపడ్డారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలతో మమేకం కావడమే షర్మిల ధ్యేయమని రఘువీరా రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు అన్నారు. ఆమె తన ప్రయత్నాలను ప్రారంభించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు ఆమెకు అనుమతి ఇస్తారో లేదో చూడాలి. ఏపీ ప్రజలు ఎవరిని ఎప్పుడు గెలిపిస్తారో ఊహించని పరిస్థితి చంద్రబాబు పై అసంతృప్తి పెరిగితే షర్మిల గెలిచే అవకాశం లేకపోలేదు. అందుకే ఆమె ప్రయత్నాలను చూసి బాబు భయపడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: