ప్రజా గాయకుడు గద్దర్ బయోగ్రఫీ ఇదే?
1949 సంవత్సరంలో... నిరుపేద కుటుంబంలో జన్మించారు గద్దర్. గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. గద్దర్ ది మెదక్ జిల్లా తుఫాన్ ప్రాంతం. గద్దర్ తల్లిదండ్రులు శేషయ్య అలాగే లచ్చుమమ్మ. ఇక గద్దర్ తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేసి బతికేవారు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా బోధనలో తన పాఠశాల విద్యను అభ్యసించారు గద్దర్.
ఆ తర్వాత హైదరాబాదులోని ఓ ప్రభుత్వ కాలేజీలో 12వ తరగతి వరకు చదివారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ని కూడా పొంది చదువు పట్ల తనకున్న ఇంట్రెస్ట్ ని చూపించారు గద్దర్. ఇక ఆ విజయ్భ్యాసం తర్వాత కెనరా బ్యాంకులో క్లర్క్ కూడా పనిచేయడం జరిగింది. ఆ ఉద్యోగం గద్దర్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఈ తరుణంలోనే విప్లవ రాజకీయాల్లోకి బయలుదేరారు గద్దర్.
అనంతరం రహస్య జీవితాన్ని గడిపిన గద్దర్ ఆ తర్వాత... సిపిఐ ఎంఎల్ గ్రూపులో చేరిపోవడం జరిగింది. ఆ తర్వాత అనేక ఉద్యమాలను చేపట్టిన... గద్దర్... 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమాల్లో పాటలు కూడా రాసేవారు గద్దర్. ఆపురా రిక్షాోడా అనేది గద్దర్ తొలి పాట. ఈ పాటను సినిమాలో వాడుకున్నారు. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ పాత్ర కీలకమైనది. తెలంగాణ ఉద్యమ కాలంలోనే గద్దర్ ప్రజా పార్టీ కూడా స్థాపించి...ప్రజల కోసం పోరాడిన యోధుడు మన గద్దర్.