ఏపీ సీఎం: డ్వాక్రా మహిళలకు మరొక వరం..!

frame ఏపీ సీఎం: డ్వాక్రా మహిళలకు మరొక వరం..!

Divya
ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. దీంతో కూటమి సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నప్పటికీ ఎన్నో ఆటంకాలు సైతం ఎదురవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా మహిళలకు చంద్రబాబు ఒక వరం ప్రకటించినట్లు తెలుస్తోంది. అది కూడా కేవలం డాక్రా మహిళలకు మాత్రమే అన్నట్లుగా సమాచారం.

కూటమి మేనిఫెస్టో లో ఆధారంగా వడ్డీ లేకుండా 10 లక్షల రుణాన్ని మంజూరు చేస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పుడు తాజాగా వీటిని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. డాక్రా మహిళలు ఆర్థికంగా వారు ఎదిగేందుకే ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది కనుక ఈ మొత్తాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తానని హామీ కూడా ఇచ్చారు ఈ పథకం అమలుపైన పలు రకాల విధివిధానాలు చర్చలు జరుగుతున్నాయంటూ తెలుపుతోంది. ప్రతినెల 1500 ఇవ్వాలా లేకపోతే ఒకేసారి 18000 ఇస్తారా లేకపోతే మూడు దఫాలుగా వాయిదాలలో చెల్లిస్తారా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదట.

ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టేందుకు సలహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పైన ఇంకా పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ సీఎం ఉన్నట్లు సమాచారం. 2019 నుంచి 24 మధ్యకాలంలో వైసిపి ప్రభుత్వం ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేసింది. అభివృద్ధి వైపు అడుగులు వేయకపోవడంతో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని ఏపీ సీఎం ఆలోచిస్తున్నారు. అలాగే అమ్మ ఒడి పేరును తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15 వేల చొప్పున అందిస్తామని తెలిపారు.. అందుకు కూడా చాలా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తున్నామని వచ్చే ఏడాది అమలు చేస్తామంటూ తెలుపుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: