చిక్కుల్లో చంద్రబాబు కుప్పం ప్రత్యర్థి భరత్... !
- వైసీపీ ఎమ్మెల్సీ పై కంప్లైంట్ చేసిన గుంటూరు భక్తులు
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ ) .
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ భరత్ చిక్కుల్లో పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు భరత్ ఆ అధికారం అడ్డం పెట్టుకుని కుప్పం చంద్రబాబు ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గం అని కూడా చూడకుండా రెచ్చిపోయిన పరిస్థితులు ఉన్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో తోమాల సేవ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి రెండున్నర లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు కుప్పం ఎమ్మెల్సీ భరత్ తో పాటు ఆయన పీఏ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాము ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని వాటికి సంబంధించిన ఆధారాలు వాట్స్అప్ చాట్స్ ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని బయటపెట్టారు. చంద్రబాబుపై ఎమ్మెల్యేగా ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన భరత్ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ హయంలో సిఫార్సు లేఖ ద్వారా టిక్కెట్లు అమ్ముకోవడం అనేది పెద్ద వ్యాపారంగా మారింది. దాన్నే టిడిపి హయంలోనూ కొనసాగింది అందుకు ప్రయత్నించారు ఎమ్మెల్సీగా తన లేఖలను టిక్కెట్ల అమ్మకానికి వినియోగించుకునేందుకు భరత్ ప్రయత్నించారు .. అయితే అనుకున్న విధంగా టిక్కెట్లు దక్కకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుప్పంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని భరత్ చేసిన దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావు అన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడులు కూడా భరత్ ఆధ్వర్యంలో ప్లాన్ చేశారన్న ఆరోపణలు టిడిపి వాళ్ళ నుంచి ఉన్నాయి. ఆ భయంతో ఇప్పుడు ఆయన అసలు కుప్పంకు పోవడం లేదు. కీలక నేతలంతా కూడా కుప్పం నుంచి పరారు అయ్యారు.. ఇప్పుడు గుంటూరులో భరత్ పై కేసు నమోదు అయింది.