ఏపీ మద్యం దుకాణాల్లో గౌడలకు స్పెషల్ రిజర్వేషన్లు ఇవే..?
- గౌడ కులానికి ప్రత్యేకంగా మద్యం షాపుల్లో రిజర్వేషన్లు
- ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీల అమలుకు కమిటీలు
( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధికారం లో ఉన్న ఐదు సంవత్సరాలలో ఇష్టం వచ్చినట్టు మద్యం పాలసీని నడిపించారు. ఇంకా చెప్పాలి అంటే మద్యం పాలసీని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేసేసింది. తూట్లు పొడిచేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. అయితే ఏపీలో మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నే ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు ఈ మార్పులు .. చేర్పులు ఉంటాయని అంటున్నారు.
మద్యం దుకాణాల్లో గౌడ వర్గానికి రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. ఇక ఈ యేడాది అక్టోబర్ 1 వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ కొత్త పాలసీ అమలు చేసే క్రమంలో నే ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రా లలో లిక్కర్ పాలసీ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అధికారులతో కూడిన నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ టీమ్ లు తెలంగాణ - తమిళనాడు - కేరళ - రాజస్థాన్ - ఉత్తర ప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలకు వెళతాయి. ఆయా రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని పరిశీలిస్తాయి. ఈ క్రమంలో నే ఆ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు, లిక్కర్ షాపులు, బార్లలో మద్యం ధరలు, మద్యం నాణ్యత, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఏపీ లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.