మరోసారి పప్పులో కాలేసిన జగన్.. ఆ ఎన్నికల్లో గెలవడం కష్టమే..??

frame మరోసారి పప్పులో కాలేసిన జగన్.. ఆ ఎన్నికల్లో గెలవడం కష్టమే..??

Suma Kallamadi
త్వరలో జరగనున్న విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఖరారయ్యారు. టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్‌ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు నాయుడు పీలా గోవింద్ ఎంపిక చేసుకొని చాలా తెలివైన పనిచేశారు. గోవింద్ కు బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దది అతనికి ఫాలోవర్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక ఆయనకున్న సంపాదన ఆ ఏరియాలో మరి ఎవరికి లేదు. అందువల్ల గోవింద్‌ బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఆయనకు ఈ ఎన్నికల్లో వైజాగ్ రూరల్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు.
అంతేకాదు అతను జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు వియ్యంకుడు. కాబట్టి ఆయన అభ్యర్థిత్వానికి జనసేన మద్దతు కూడా ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటు జనసేన పార్టీకి దక్కడంతో పీలా గోవింద్‌కు టికెట్‌ ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న గవర సామాజికవర్గానికి చెందిన ఆయన కులాల దృష్ట్యా తెలివిగా ఎంపికయ్యారు. దీనికి తోడు జగన్ స్థానికేతర అభ్యర్థిని నిలబెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీలా గోవింద్ తో లోకల్ పొలిటిషన్ అనే సెంటిమెంట్ చంద్రబాబు వాడుతున్నారు. ఎన్నికల్లో గెలుపుకి ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. జగన్ మాత్రం నాన్ లోకల్ అభ్యర్థిని నిలబెట్టి మరోసారి పప్పులో కాలేశారు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేరే వారిని తీసుకువచ్చే ఆయా నియోజకవర్గాల్లో దింపి తప్పు చేశారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి జనసేనలోకి మారడంతో అనర్హత వేటు పడినందున ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి మంచి ఆధిక్యం ఉంది. 841 మంది ఓటర్లలో 615 మంది వైసీపీకి మద్దతు ఇవ్వగా, టీడీపీకి 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి.టీడీపీ 2020 ఎన్నికలను బహిష్కరించింది, కానీ దాని మద్దతుదారులు, నాయకులు చాలా ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేనందున పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సీటును ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: