వైసీపీకి మ‌రో బిగ్ షాక్‌... ఈ కీల‌క నేత జ‌న‌సేన లోకి జంప్‌.. ?

frame వైసీపీకి మ‌రో బిగ్ షాక్‌... ఈ కీల‌క నేత జ‌న‌సేన లోకి జంప్‌.. ?

RAMAKRISHNA S.S.
( గోదావ‌రి , కాకినాడ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుని ఘోర పరాజజ‌యం చూసిన వైసిపికి మరికొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. గతంలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడ‌గా ... ఇప్పుడు మరొక మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఎవరో కాదు ? కాకినాడ జిల్లాలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. దొరబాబు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై దొరబాబు తన కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో సంప్రదింపులు జరుగుతున్నారు.


సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును కాదని గత ఎన్నికలలో జగన్ అప్పుడు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం సీటు కేటాయించారు. వంగా గత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా 72, 000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే దొరబాబు వైసిపి లో లైఫ్ లేదన్న‌ నిర్ణయానికి వచ్చి ఆ పార్టీకి రాజీనామా చేసి ఎందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో జగన్ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బతికిస్తూ వచ్చిన దొరబాబుకు ఈ ఎన్నికలకు ముందు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి.

పార్టీ అధిష్టానంతో సరిగా సంప్రదించకుండానే వంగా గీత కు ఇక్క‌డ టిక్కెట్ ఇచ్చింది. అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం బుజ్జగించి వంగా గీత గెలుపుకు కృషి చేయాలని చెప్పినా ... అక్కడ స్వయంగా పవన్ పోటీ చేయడంతో దొరబాబు ఏం చేయలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు జనసేన అధినేత అక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆ పార్టీలో చేరటం మంచిద‌న్న‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: