నామినేటెడ్ ప‌ద‌వుల్లో కొత్త ఫార్ములా... టీడీపీ - జ‌న‌సేన - బీజేపీ ఎవ‌రి వాటా ఎంతంటే..?

frame నామినేటెడ్ ప‌ద‌వుల్లో కొత్త ఫార్ములా... టీడీపీ - జ‌న‌సేన - బీజేపీ ఎవ‌రి వాటా ఎంతంటే..?

RAMAKRISHNA S.S.
- మూడు పార్టీల‌కు చెందిన నేత‌ల‌తో బాబు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ
- రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా ప‌ద‌వుల భ‌ర్తీ
- టీడీపీ 60 - జ‌న‌సేన 25 - బీజేపీ కి 15 శాతం కోటా
- కీల‌క ప‌ద‌వులు మూడు పార్టీల‌కు కేటాయింపు
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయం ఎలా ఉండ బోతోంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తి గా మారింది. ఇప్ప‌టికిప్పుడు ఓ 400 నామినేటెడ్ ప‌ద‌వుల‌ను వెంట‌నే బ‌ర్తీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రెవ‌రు ఏ యే ప‌ద‌వులు తీసుకోవాలి ?  కూట‌మి లో ఉన్న మూడు పార్టీల‌కు ఏ నిష్ప‌త్తి లో ప‌ద‌వుల‌ను పంపిణీ చేయాల‌న్న దానిపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు గా తెలుస్తోంది.

మొత్తం భ‌ర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో 60 శాతం టీడీపీనే తీసుకుంటుంద‌ట‌. ఇక మిగిలిన 40% లో 25% జనసేన, 15% బిజెపిలు పంచుకునే అవకాశం ఉందని .. చంద్ర‌బాబు అలాగే ప్లాన్ చేశార‌ని అంటున్నారు. ఇందు కోసం ఓ స్పెష‌ల్ ఫార్ములాను తయారు చేశారని తెలుస్తోంది. టీడీపీకి ఒంట‌రి గానే మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌చ్చింది. కానీ చంద్ర‌బాబు మాత్రం కూట‌మి ధ‌ర్మానికే క‌ట్టుబ‌డి జ‌న‌సేన .. బీజేపీ వాళ్ల ను కూడా కేబినెట్ లోకి తీసుకుని మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

ఇక ఇప్పుడు నామినేటెడ్ ప‌దువుల విష‌యంలో మూడు పార్టీల‌కు చెందిన వారిని సంతృప్తి ప‌ర‌చాల‌న్న నిర్ణ‌యం మేర‌కే చంద్ర‌బాబు 60 : 25 : 15 ఫార్ములాతో నామినేటెడ్ పదవులు పంచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆ యా పార్టీల కు ఏయే ప‌ద‌వులు ఇస్తామో చెప్పి.. ఆ పార్టీల నుంచి వ‌చ్చిన జాబితా ఆధారంగా వారికే ఆ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ఇవ్వ‌నున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: