ఏపీలో మరో దారుణం.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు..!

frame ఏపీలో మరో దారుణం.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు..!

Divya
రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో మానవత్వం మంట కలిసి పోయేలా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను సాక్ష్యం అని కూడా చెప్పవచ్చు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని కొంతమంది యువకులు ఒకడిని చేసి బెల్టులతో కర్రలతో కాళ్లతో తంతు చావబాదిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణం చూసిన ప్రజల సైతం ప్రభుత్వానికి ఇలాంటివి ఏవి కనిపించవా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో చాలా వైఫల్యం అవుతున్నారేమో అని అంతగా మాట్లాడుతున్నారు.

అయితే ఈ వీడియో గత నెల 30వ తేదీ జరిగిందట. కానీ ఇప్పుడు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాధితుడు తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.. బాధితులు తల్లి తెలిపిన ప్రకారం.. చిన్న పరిమి గ్రామానికి చెందిన అజ్గర్ అనే యువకుడిని కొంతమంది యువకులు పని ఉందంటూ తమతో తీసుకువెళ్లి మద్యం తాగించారట. అలా వారు కూడా మద్యం సేవించిన తర్వాత కొన్ని కారణాలు చెబుతూ ఆ యువకుడు పైన చాలా దారుణంగా విచక్షణ రహితంగా కొట్టడం తన్నడం బెల్టులతో చితకబారడం వంటివి చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.

ముఖ్యంగా అతడిని కాళ్లు చేతులు తేడా లేకుండా కర్రలతో బెల్టులతో సైతం చితకబాదుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ దృశ్యాలను వాళ్లే మొబైల్ లో చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నట్లు కనిపిస్తుంది. చివరికి తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడుని సైతం కాలువలోకి విసిరేద్దాం అనుకుంటున్నా సమయంలో ఆ యువకుడు యొక్క సొంత గ్రామానికి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సైతం తెలియజేశారట. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడిని తీసుకొని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి  తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: