పొలిటికల్ సెలబ్రిటీస్ - జైలు శిక్షలు : అమ్మ జయలలిత అరెస్ట్ అప్పట్లో పెను దూమారమే రేపిందిగా..?

frame పొలిటికల్ సెలబ్రిటీస్ - జైలు శిక్షలు : అమ్మ జయలలిత అరెస్ట్ అప్పట్లో పెను దూమారమే రేపిందిగా..?

murali krishna

* జయలలిత జీవితమంతా పోరాటమే..ఎన్నో అవమానాలు,ఎన్నో కష్టాలు..
* తమిళ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా మారిన జయలలిత
* అవమానించిన చోటే తిరిగి అధికారం పొందింది.
* ఆమె జీవితంలో మాయని మచ్చగా మారిన అక్రమాస్తుల కేసు..

కన్నడ నాట పుట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి తమిళ రాజకీయాలను శాసించిన ఫైర్ బ్రాండ్ జయలలిత.రెండేళ్ల వయసులో తండ్రి చనిపోయి తాత గారి ఇంట పెరిగిన జయలలిత అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్ షిప్ తో చదువుకుంది.అప్పటికే తల్లి స్పందన కూడా నటి కావడంతో సినిమా రంగంలో చిన్న నాటి  నుండే పరిచయం ఏర్పడింది.జయలలిత ఎప్పటికైనా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కళలు కనేది.అందుకు సినీ రంగాన్ని వేదికగా చేసుకొని దక్షిణాది సినీ రంగంలో ఏకంగా మూడు భాషలలో అద్భుతమైన నటనతో ఎంతగానో రాణించింది.
1977 లో ఎంజిఆర్ అన్నాడిఎంకే స్థాపించి ఆమెను పార్టీలోకి ఆహ్వానించినపుడు ఆమె సున్నితంగా తిరస్కరించారు.ఆ తరువాత ఎంజిఆర్ స్నేహం పెరిగింది .1982 ఎంజిఆర్ ఆహ్వానం మేరకు అన్నాడిఎంకే ప్రచారంలో జయ పాల్గొంది.ఈ ప్రచారంలో ఆమె చేసిన ప్రసంగం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.1983 లో తీరు చందూర్ ఉప ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే గా గెలుపొందింది..ఆ తరువాత 1984 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఎంజిఆర్ కు సినీ చరిష్మా వున్నా కరుణానిధి లా మాట్లాడే చాతుర్యం లేదు.కానీ ఆ లోటును జయలలిత తీర్చింది.పార్టీలో ఆమె కీలకంగా ఎదిగింది.
1988 లో ఎంజిఆర్ మరణం తరువాత పార్టీ రెండుగా చీలిపోయింది .పార్టీలోని కీలక నేతలని ఆమె తనవైపుకు తిప్పుకుని అన్నాడిఎంకె అధినేత్రి అయింది.1989 అసెంబ్లీ లో డిఎంకె మంత్రి దురైమురుగన్ జయలలిత చీర పట్టుకొని లాగిన ఘటన అప్పట్లో దుమారం రేపింది .నిండు సభలో తనకు జరిగిన అవమానానికి కృంగిపోయిన జయ మళ్ళి సీఎం అయ్యాకే తాను అసెంబ్లీ అడుగుపెడతాను అని శపధం చేసింది.1991 లో జానకి రామచంద్రన్ పార్టీని అన్నాడిఎంకే లో విలీనం చేసుకుని సీఎం అయిన జయలలిత కరుణానిధిని టార్గెట్ చేస్తూ వచ్చారు.తానూ  గెలిచాక డిఎంకే అధినేత కరుణానిధిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేయించి సంచలనం సృష్టించారు.జయలలిత అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని కేసులు వేయడంతో 2014 సెప్టెంబర్ 27 న బెంగుళూరు ప్రత్యేక న్యాయస్థానం ఆదాయానికి మించి ఆస్తులు కూడ గట్టారని సాక్షాదారాలతో నిరూపించి 4 సంవత్సరాలు జైలు శిక్ష ,100 కోట్ల జరిమానా విధించడం జరిగింది.దానితో పదవి కోల్పోయిన జయలలిత తనకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వమ్ ను సీఎంను చేసింది.
2015 లో జయలలిత ఆ కేసు నుండి విడుదల అయిన తరువాత పన్నీర్ సెల్వం చెన్నై ఆర్ కే నగర్ నుండి పోటీ చేసి విజయం సాధించి మళ్ళి సీఎం సీటు జయలలితకు అప్పగించారు.2016 ఎన్నికలలో పోటీ చేశాయి విజయం సాధించిన జయలలిత మళ్ళి సీఎం అయ్యారు. అనారోగ్యం కారణంగా 2016 సెప్టెంబర్ లో అపోలో హాస్పిటల్ లో చేరి రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఆమె కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: