ఏపీ సర్కార్:EWS విద్యార్థులకు గుడ్ న్యూస్..?

frame ఏపీ సర్కార్:EWS విద్యార్థులకు గుడ్ న్యూస్..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలలో 2024-2025 సంవత్సరానికి గాను ఎంబిబిఎస్ బిడియోస్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు ఈసారి EWS కోట కింద 10 శాతం సీట్లు భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. ఈ కోట కింద అన్ని ప్రభుత్వ ప్రవేట్ మెడికల్ కాలేజీలలో కూడా ఖచ్చితంగా సీట్లు భర్తీ చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశాలను జారీ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం EWS కోటాను ఎక్కడ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తో పాటు అన్ని మెడికల్ కాలేజీలలో కూడా EWS కోటాను 10 శాతం సీట్లు భర్తీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం మైనార్టీ విద్యాసంస్థలకు వర్తించదట. అయితే ఎంబిబిఎస్ సీట్లతో పాటు అటు పీజీ డెంటల్ కోర్సులలో కూడా EWS వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సులలో మాత్రం ఇది వర్తించదని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు తెలియజేశారు.

 తెలంగాణలో కూడా మెడికల్ కాలేజీలలో ఎంబిబిఎస్ సీట్ల విషయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ను కూడా జారీ చేసింది. 2017 జులై 5న కేసీఆర్ సర్కార్ జారీ చేసిన జీవో114 నీ మంత్రి దామోదర్ ప్రస్తావించడం జరిగింది.. ఆనాటి జీవ ప్రకారం 9 నుంచి 12వ తరగతి చదివిన విద్యార్థులు స్థానికులుగా వస్తారని.. కానీ తాజాగా విడుదల చేసిన 33 జీవోలో కొనసాగించలేము అని తెలిపారు.. జీవో 114 నిబంధన ప్రకారం ఎవరైనా విద్యార్థి  తెలంగాణలో నాలుగేళ్లు..మూడు సంవత్సరాలు ఏపీలో చదివితే వారిని తెలంగాణ స్థానికులుగా పరిగణించినట్లుగా తెలిపారు. కానీ విభజనలో ఉన్నటువంటి చట్ట ప్రకారం జూన్ 2వ తేదీతో పదేళ్లు పూర్తి అవ్వడం వల్ల ఇది కొనసాగించాల్సిన పనిలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: