నామినేటెడ్ పదవులు.. చంద్రబాబు తీరుపై జనసేన అసంతృప్తి?
ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 బిజెపి పది స్థానాల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మొత్తంలో అయితే సీట్లు కేటాయించారో.. ఆ ప్రాతిపదికనే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా వాటా ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై అటు జనసేన బిజెపి పార్టీల నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు సమయంలో తాము 31 స్థానాలలో మాత్రమే పోటీ చేశాము అంటే 144 సీట్లలో పోటీ చేయలేదని కాదు అని.. వాటిని త్యాగం చేశాము అని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారట.
ఆ లెక్కన చూస్తే తమకు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మొత్తంలో సీట్లు కేటాయించారు. కాబట్టి ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 80% పోస్టులు ఇవ్వాలని.. కానీ అంత మొత్తంలో ఇవ్వకపోయినా లెక్కలతో నిమిత్తం లేకుండా కీలక త్యాగాలు చేస్తున్న బలమైన నాయకులు అందరికీ కూడా నామినేటెడ్ పదవులు దక్కేలా చూడాలని కోరుతున్నారట జనసేన బిజెపి పార్టీల నేతలు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేసేందుకు ఇక పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి పార్టీ నేతలు డిమాండ్లను పవన్ చంద్రబాబు ముందు వినిపిస్తారో లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎన్ని ఇస్తే అన్ని చాలు అన్నట్లుగా ఊరుకుంటారో అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.