బెయిల్ విషయంలో వెనకడుగు వేసిన కవిత.. ఎందుకలా..?
కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై అరెస్టయిన సంగతి తెలిసిందే అప్పటినుంచి ఆమె తీహార్ జైలులో ఉన్నారు చిన్న చిన్న కారణాలకి బెయిల్ పిటిషన్ వేస్తూ బయటికి రావాలని చూస్తున్నాడు కానీ కుదరడం లేదు. అయితే ఇటీవల ఆమె ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటీషన్‌ను విత్‌డ్రా చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె లాయర్ న్యాయమూర్తికి తెలియజేశారు. బెయిల్ కోసం ఎప్పుడూ ప్రయత్నించే కవిత ఇప్పుడు మాత్రం రివర్స్ ఎందుకు వేశారు అని రాజకీయ వర్గాల్లో చాలామంది చర్చలు మొదలుపెట్టారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.
ఈ పిటిషన్ వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని ఇది కచ్చితంగా తిరస్కరణకు గురవుతుందని న్యాయ నిపుణులు కవితకు ముందే చెప్పారట. ఆ కారణంగానే ఆమె వేస్ట్ పిటిషన్ ఎందుకు అన్నట్లు దానిని విత్ డ్రా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సీబీఐ సక్రమంగా చార్జీ షీట్ ఫైల్ చేయని కారణంగా ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు అయింది. ఇదే విషయమై జులై ఆరవ తేదీన కవిత కోర్టు మెట్లు ఎక్కారు. మరోవైపు జులై 25 రెండవ తేదీన కోర్టు సీబీఐ చార్జి షీట్ ను పరిగణలోకి తీసుకుంది. అవే కాపీలు కవిత లాయర్లకు కూడా అందించడం జరిగింది.
ఇదిలా ఉండగా సోమవారం ఆమె పేరు పిటిషన్ విచారణకు వచ్చింది. కాగా ఈ సమయంలో లాయర్లు హాజరు కాలేదు. అందువల్ల విచారణను బుధవారానికి వాయిదా వేసారు. సీబీఐ ఛార్జ్ షీట్ ఆల్రెడీ దాఖలయ్యింది కాబట్టి పిటిషన్ పై విచారణ జరిపిన ఉపయోగం ఉండదని విత్‌డ్రా చేసుకున్నారు.
బీఆర్‌ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంది కవితకు బెయిల్ ఇప్పించాలంటూ ప్రముఖ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. వాళ్లు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటీషన్‌ను ఉపసంహరించుకోవాలని లాయర్ల సలహాల ద్వారా తెలియజేశారు. అందుకే కవిత ఈ పని చేసినట్లు తెలుస్తోంది.