జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ ట్విస్ట్‌..!

frame జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ ట్విస్ట్‌..!

Divya
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తుల‌ కేసు విచారణ ప్రారంభించాల‌ని సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇప్పటికే చాలా రోజులుగా కొనసాగుతున్నందున వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో వైసిపి వర్గాలు ఒకసారిగా ఉలిక్కి పడ్డాయి. ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండి నియోజ‌క వ‌ర్గ‌ ఎమ్మెల్యే ... మాజీ ఎంపీ కనుమూరి రఘురామ‌ కృష్ణంరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కన్నా నేతృత్వంలోని ధర్మసనం విచారణ చేసింది.
తదుపరి విచారణలను నవంబర్ నెలలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటీషన్ పై ఇప్పటికే రెండుసార్లు ధర్మసనం విచారణ కూడా జరిపింది. సిబిఐ దాఖలు చేసిన అప్పుడే వీటిలో అంశాలు షాకింగ్ గా ఉన్నాయని సంజీవ్ కన్నా వ్యాఖ్యనించారు. కేసులో ట్రైల్‌ ప్రారంభం కాకుండా ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని సంజీవ్ కన్నా ప్రశ్నించారు. ఇప్పటికే ఆరుగురు జడ్జిలు మారిపోయారు .. కొంద‌రు రిటైర్ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సంజీవ్ కన్నా కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని ... ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రైల్ కి సంబంధం లేదని కూడా చెప్పారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్ల ను విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని ... ఎలాంటి అడ్డంకి తమకు రావటం లేదని ఈ సందర్భంగా సంజీవ్ కన్నా వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఈ కేసులో సుప్రీం నిర్ణ‌యం ఇప్పుడు వైసీపీ వాళ్ల‌ను కాస్త టెన్ష‌న్ పెట్టేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: