జగన్ బెస్ట్ ఫ్రెండ్ ద్వారంపూడికి కూటమి మార్క్ చెక్..?
ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ద్వారంపూడిని టార్గెట్ చేస్తారన్న అంచనాలకు తగినట్టుగానే ద్వారంపూడి ఒక్కో అక్రమాన్ని బయట పెడుతూ .. ద్వారంపూడి వ్యాపారాలకు బ్రేకులు వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ ముందు నుంచి చెపుతూనే వస్తున్నారు. రాష్ట్రం అంతా అక్రమ రేషన్ దందా ఒక ఎత్తు అయితే.. కాకినాడ కేంద్రం గా సాగే రేషన్ బియ్యం అక్రమ దందా మరో ఎత్తు.
అక్కడ అక్రమ రేషన్ దందా అంతా వైసీపీ మాజీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కనుసన్న ల్లోనే జరుగుతుందన్న ఆరోపణలు ఎప్పుటి నుంచో ఉన్నాయి. ఎన్నికల సమయంలో ద్వారంపూడిని జనసేనాని పవన్ కళ్యాణ్ నీ ఆట కట్టిస్తా అంటూ గట్టిగానే హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి అక్రమ రేషన్ దందాను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల స్వయంగా రంగంలోకి దిగారు. ఇదంతా జనసేన అధినేత పవన్ సూచన లు .. కంట్రోల్ మేరకే జరుగుతుందన్న చర్చలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ద్వారంపూడి దందాకు ఇక చెక్ పడినట్టే అనుకోవాలి.