వైసిపి ఖాళీ ఖాళీ: పోస్టులు పెట్టడం తప్ప..పార్టీని పట్టించుకోవడం లేదే ?

frame వైసిపి ఖాళీ ఖాళీ: పోస్టులు పెట్టడం తప్ప..పార్టీని పట్టించుకోవడం లేదే ?

Veldandi Saikiran

* సోషల్ మీడియాకే పరిమితమైన సాయిరెడ్డి
* శాంతి ఎపిసోడ్‌ తో సాయిరెడ్డి ఉక్కిరి బిక్కిరి
* ఓటమి తర్వాత నెల్లూరును వదిలేసిన విజయసాయి
* బీజేపీలో నేతలతో వరుస మీటింగ్‌ లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలు అయిన తర్వాత...  ఆ పార్టీలో నేతలు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలే గెలుచుకున్న వైసీపీ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక అటు కూటమి పార్టీకి భారీ స్థాయిలో సీట్లు రావడంతో వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గాలలో ఓడిపోయిన వైసీపీ నేతలు అసలు... క్యాడర్ను పట్టించుకోకుండా బయట బయట తిరుగుతున్నారు. అలాంటి వారిలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒకరు. వాస్తవానికి విజయసాయిరెడ్డి కి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఢిల్లీలో వ్యవహరించడం తప్ప...జనాల నాడి పట్టుకునే శక్తి లేదు. అసలు ప్రజలను ఎన్నడూ కూడా పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

అలాంటి విజయసాయి రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో... విజయ్ సాయి రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయితే నెల్లూరులో ఓడిపోయిన తర్వాత... అక్కడి వైసీపీ క్యాడర్ను పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఢిల్లీ టు  వైజాగ్ అన్నట్లుగా విజయ సాయి రెడ్డి... తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నెల్లూరు నేతలతో... సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు.

అసలు పార్టీ ఎందుకు ఓడిపోయింది ? వైసిపి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ?  నెల్లూరులో వైసీపీని మళ్లీ బలోపేతం ఎలా చేయాలి అనే దానిపైన విజయసాయిరెడ్డి ఎక్కడ ఫోకస్ పెట్టలేకపోయారు. ఇంతలోనే శాంతి వ్యవహారం vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి మెడకు చుట్టుకుంది. దీంతో కొత్త ఛానల్ పెడతానని హడావిడి చేస్తున్నారు విజయసాయిరెడ్డి. దీంతో నెల్లూరు క్యాడర్ మొత్తం... తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: