వైసీపీ ఖాళీ ఖాళీ:బొత్స ఫ్యామిలీ ఆలౌట్.!
- 2024 ఎలక్షన్స్ లో పాతాళానికి.
- దిక్కుతోచని స్థితిలో బొత్స ఫ్యామిలీ.!
విజయనగరం జిల్లా రాజకీయాల పేరు చెప్పగానే చాలామందికి బొత్స కుటుంబీకులే గుర్తుకొస్తారు. బొత్స సత్యనారాయణ అయితే గత 20 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో తన మార్కు చూపిస్తున్నారు. అలాంటి బొత్స సత్యనారాయణతో పాటు తన ఫ్యామిలీని కూడా ఈసారి మడిచి అవతల పడేసారు. అలాంటి విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ సైలెంట్ అయిపోయి దారుణంగా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణకు సపోర్ట్ చేసే స్థితిలో కూడా కనిపించడం లేదు. మరి బొత్స పరిస్థితి ఏంటి వారంతా ఎక్కడికి వెళ్లారు అనే వివరాలు చూద్దాం.
సత్యనారాయణకు షాక్:
కాంగ్రెస్ మరియు వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ, పొలిటికల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ మరియు వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 నేతగా ఉన్న ఈయన ఈ ఎన్నికల్లో దారుణంగా చతికిలపడ్డారు. బొత్స తో పాటు భార్య, సోదరుడు, మేనల్లుడు అందరూ ఓడిపోయారు. టిడిపి నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు చేతిలో బొత్స సత్యనారాయణ 11,900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004 నుంచి 2009 చీపురుపల్లిలో గెలిచిన బొత్సకు ఈసారి మాత్రం పరాభవం తప్పలేదు. ఈయనకే కాకుండా తన తన సోదరుడు అయినా అప్పల నరసయ్య గజపతినగరం నుంచి పోటీ చేశారు. ఈయన కూడా చాలా దారుణ ఓటమి పాలయ్యారు. ఇక విశాఖ ఇంటికి పోటీ చేసిన ఆయన భార్య బొత్స ఝాన్సీ కూడా దాదాపు 5 లక్షల తేడాతో ఓడిపోయారు.