లోకేష్ ని ఏది అడిగినా..క్షణాల్లో ఇచ్చేస్తున్నారు ?
ఈ తరుణంలోనే... తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ మారుతున్నారు. మంత్రి నారా లోకేష్ మరో మంచి పని చేశారు. జమ్మలమడుగు ప్రాంత సమస్యను... నోట్ చేసుకున్న నారా లోకేష్ వారి సమస్యను తీర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు అవుతున్నా... జమ్మలమడుగులో అసలు ఫోన్లకు సిగ్నల్ గా ఉందట. జమ్మలమడుగు వెళ్లిన వెంటనే.. ప్రపంచంతో బంధం తెగిపోతుందట.
ఆ ఊర్లో 108 కుటుంబాలు అలాగే 400 మంది ఓటర్లు ఉన్నా కూడా గ్రామంలో... సిగ్నల్స్ మాత్రం అందించేందుకు ఏ ప్రభుత్వం సహాయం చేయలేదని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.ఫోన్లో మాట్లాడాలంటే కచ్చితంగా మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందేనని అక్కడి ప్రజలు చెప్పారు.అయితే ఈ సమస్యను ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ద్వారా నారా లోకేషన్ తెలిసింది. వెంటనే స్పందించిన నారా లోకేష్.. త్వరలోనే మొబైల్ టవర్ జమ్మలమడుగులో హామీ ఇచ్చారు.