పారిపోతున్న నేతలు? వైసీపీ భవిష్యత్తు కష్టమే?
* వైసీపీ నుంచి రాలిపోతున్న నేతలు
* కష్టంగా మారిన వైసీపీ భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : ఎన్నికల టైం నుంచి కూడా వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొన్ని రోజుల నుంచి వైసీపీ పార్టీ నుంచి నేతలు వైదొలగడం ప్రారంభించారుఒక్కొక్కరుగా పలువురు నేతలు వేరే పార్టీల గూటికి చేరారు. అంతేగాక ఎన్నికల్లో వైసీపీపైనే పోటీకి కూడా నిలబడ్డారు. ఆ ఎదురు దెబ్బలకు కూడా పెద్దగా పట్టించుకోని వైసీపీకి.. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రజలు ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి వైసీపీలో వలసలనేవి ఊపందుకున్నాయి. పేరు మోసిన నేతలు కూడా వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ వైపు మల్లుతున్నారు. ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ స్థాయిలోని నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లోకి వచ్చేస్తున్నారు. ఈమధ్య ఈ వలసలు కాస్త తగ్గుముఖం పట్టాయని అన్న భావన కూడా మొదలైంది. అయితే అదేమీ లేదని.. వైసీపీ ఖాళీ అయ్యే దిశగానే అడుగులు వేస్తోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు తన రాజీనామాతో చెప్పారు.