హైదరాబాద్ లోకి అక్రమంగా బంగ్లాదేశీయులు?

Veldandi Saikiran

హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. హైదరాబాద్ లోకి అక్రమంగా బంగ్లాదేశీయులు చొరబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  బంగ్లాదేశీయులు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోకి వస్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాటేదాన్, బాలాపూర్, ఫలక్నుమా, మైలార్ దేవ్ పల్లి, పహడి షరీఫ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానితులను కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

చిరు వ్యాపారులు, పరిశ్రమలు, భవన నిర్మాణరంగ కార్మికులుగా ఉపాధి అవకాశాలు చూసుకుని ఉంటున్నారట. వీలు కుదిరినప్పుడల్లా పోలీసులకు తెలియకుండా స్వదేశానికి వెళ్లి దర్జాగా తిరిగి వస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల కోల్కత్తా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు మైనర్లు ఆపరేషన్ ముస్కాన్ లో బయటపడ్డారు. స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆ పిల్లల్ని సొంత దేశానికి పంపించారు. పశ్చిమ బెంగాల్ లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డారు.

హైదరాబాద్ నగరంలోని తమ బంధువులు సూచనతో ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినట్లు పోలీసుల. అక్రమంగా రాష్ట్రానికి చేరిన బంగ్లాదేశీయుల్లో కొందరు దళారులుగా మారుతున్నారట. ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసేందుకు తమ వారిని నగరానికి తీసుకువస్తున్నారు. అక్రమంగా సరిహద్దులు దాటించే రైళ్లలోకి చేర్చెంతవరకు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా ఐదు, ఆరు వేల వరకు కమిషన్ ఇస్తున్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్కత్తా చేరుతున్నారు. కోల్కతాలో నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేసి చేతికి ఇచ్చి రైలు మార్గంలో తెలంగాణకు తరలిస్తున్నట్లు పట్టుబడిన నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఆపరేషన్ ముస్కాన్ లో దొరికిన ఐదుగురు మైనర్లు తమతో పాటు మరో 20 మందిని ఇక్కడికి తీసుకువచ్చినట్లు చెప్పారు. కాగా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. రాజీనామా చేసి.. ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: