ఏపీ సిఎం: ఇన్ పుట్ సబ్సిడీపై రైతులకు గుడ్ న్యూస్..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ ఇటీవలే ఆదేశాలను కూడా జారీ చేశారు.. అలాగే రాష్ట్రంలో పంటల పైన ఈ గ్రాఫింగ్ నమోదు చేయించాలంటు తెలియజేశారు. జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు సైతం 36 కోట్లకు పైగా ఇన్ పుట్ సబ్సిడీ సైతం విడుదల చేయాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఈ విషయం పైన కాస్త రైతులకు గుడ్ న్యూస్ అన్నట్లుగా తెలుస్తోంది.

అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని కూడా పెంచాలని కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తూ ఉన్నారంటూ.. రాబోయే రెండేళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తి కూడా మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలంటే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే మైక్రో ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు వంటివి కూడా ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేయాలని అధికారులను కూడా ఆదేశించారు ఏపీ సీఎం.. ఎక్కువగా టమోటా, నిమ్మ, మామిడి వంటి ఉత్పత్తుల వాటిని ప్రోత్సహించాలంటూ సూచించారు.

వీటిని ఎగుమతులు చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయని.. తెలియజేశారు.త్వరలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేయడం పైన కొన్ని సూచనలను కూడా తీసుకోబోతున్నామని లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నెంబర్లు బ్యాంకు ఖాతాలను అనుసంధానానికి ఉండేలా చూసుకోవాలంటే ఆదేశాలను జారీ చేశారు ఈమెరకు జియో ట్యాగ్ చేయాలను కూడా తెలియజేశారు ఏపీ సీఎం.. మరి ఆ వరద వల్ల ప్రభావితమైన ప్రాంతాలు ఏవేవి ఉంటాయో అంటూ రైతులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన అటు వ్యవసాయ శాఖ అధికారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రాబోయే రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ వంటివి కూడా ఇచ్చేలా చూడాలి అంటే ప్రజలు కూడా కోరుకుంటున్నారు మరి వీటి పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: