ఇండియాను హెచ్చరిస్తున్న బ్రిటన్ గుణపాఠం?

frame ఇండియాను హెచ్చరిస్తున్న బ్రిటన్ గుణపాఠం?

Chakravarthi Kalyan
బ్రిటన్ హింసతో అట్టుడుకుతోంది. యూకే వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు బ్రిటన్ జాతీయులైన పిల్లలపై కత్తి పోట్ల దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అక్కడి యూకే వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.  ఇవి హింసాత్మకంగా మారాయి.

గతవారం బ్రిటన్ లోని వాయువ్య పట్టణమైన సౌత్ పోర్టులో ముగ్గురు బాలికలపై కత్తిపోట్ల దాడి జరిగింది. ఈ దాడిలో వారు ముగ్గురు మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. వలస, వ్యతిరేక ముస్లిం వ్యతిరేక నిరసనలు తెలపడం ప్రారంభం అయ్యాయి.

అయితే ఆఫ్రికా, యూరప్ తదితర దేశాల నుంచి బ్రిటన్ లోకి వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి ప్రభుత్వం తాత్కాలికంగా హోటళ్లలో ఆశ్రయం కల్పిస్తోంది. దీని కోసం గతేడాదిలో రూ.250 కోట్ల పౌండ్లు, అంటే దాదాపు రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు.

దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండగా అక్రమ వలసదారులకు కోసం అంత నిధులు ఖర్చుచేయడం ఏంటన్న అసంతృప్తి అక్కడి ప్రజల్లో ఉంది. ఈ సమస్య ఇటీవల ఎన్నికల్లో ప్రధానమైంది. అయితే రువాండా నుంచి పడవల్లో వచ్చే వారిని అనుమతించమని మాజీ ప్రధాని రుషి సునాక్ హామీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

మరోవైపు బ్రిటన్ లో హింసాకాండను ఎంత మాత్రం సహించబోమని ప్రధాని స్టార్మర్ హెచ్చరించారు. ఈ హింసపై ఎలన్ మస్క్ స్పందిస్తూ… బ్రిటన్ లో అంతర్యుద్ధం తప్పదని వ్యాఖ్యానించారు. అయితే ప్రారంభంలో వేరే దేశాల నుంచి ఛీప్ లేబర్ వస్తున్నారని బ్రిటన్ కూడా వారిని అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవిస్తోంది. మన దేశంలో కూడా బంగ్లాదేశీయులు, మయన్మార్, పాకిస్థాన్, శ్రీలంక నుంచి పలువురు వలసవాదులు చొచ్చుకొని వస్తున్నారు. వీరిని మనం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కూడా బ్రిటన్ ఎదుర్కొంటున్న పరిస్థితే భారత్ కు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: