వినేశ్‌ ఫోగాట్‌: మోదీపై ఇవేం దిక్కుమాలిన ఆరోపణలు?

Chakravarthi Kalyan
చేతిలోని కత్తిని మంచికి వాడొచ్చు. చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ ని, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్లు? దాని దుర్వినియోగం, విష ప్రచారం తాలుకూ పరిణామాలు మనం కొన్ని చోట్ల చూశాం.  ఒలింపిక్స్ లో ఇండియాకు మొదటి గోల్డ్ మెడల్  సాధిస్తుంది అని అందరూ ఆశలు పెట్టుకున్న వినేశ్ ఫోగట్పై అనర్హత  వేటు పడింది.  50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరిన వినేశ్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కలిగి ఉందనే కారణంతో ఆమెపై ఒలింపిక్స్ లో అనర్హత వేటు వేశారు. అయితే గత ఏడాది దిల్లీలో జరిగిన రెజ్లర్ల ధర్నాలో వినేశ్ ఫోగట్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఈమె భారత్ కు నాలుగో మెడల్ పక్కా చేయడంతో పాటు బంగారు పతకంపై ఆశలు రేపింది. కానీ ఇప్పుడు బంగారు ఆశలు పెట్టుకున్న భారతీయుల అందరికీ షాక్ తగిలింది.  ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అందరూ ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈమె అనర్హత వేటుకు గురికాగానే ప్రధాని మోదీ మొదటగా స్పందించారు. వినేశ్ నువ్వు ఛాంపియన్లకు ఛాంపియన్ వి. దేశానికి నువ్వు గర్వకారణం. ఈ రోజు తగిలిన ఎదురు దెబ్బ బాధ కలిగించేదే. దీని వల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధికమించే నీ సత్తా నాకు తెలుసు. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో. మేమందరం నీకు అండగా ఉన్నాం అని తండ్రిలాగా ఆప్యాయంగా పోస్టు చేశారు.

కానీ రెజ్లర్ల దీక్షలో ధర్నా చేసినందుకు ఆమె పై కుట్ర పన్నారని నరేంద్ర మోదీపై కొందరు పని గట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు. ప్రధాని పై అనుచిత పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ప్రధానిని నెగిటివ్ గా చూపించే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఆమె అనర్హత వేటుకు గురి కాగానే ఆప్యాయంగా పలకరించి… దీనిపై ఏం చేయొచ్చని ఆరా తీస్తే కావాలని కొంత మంది ప్రధానిని కించపరుస్తూ పోస్టులు పెట్టి రాక్షాసానందం పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: