కూటమిలో కుంపట్లు: టీడీపీ నేతలకు నరకం చూపిస్తున్న జనసేన ఎమ్మెల్యే ?
* వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు
* చిత్తూరు, తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణికి అనుభవం
* తిరుపతి టీడీపీ నేతలు, ఆరణి మధ్య వార్
* వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే
ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది.ఈ రెండు నెలల కాలంలో... ఏపీని అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చంద్రబాబు సర్కార్ తీసుకువెళ్తోంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది కూటమి సర్కారు. అయితే ఈ నేపథ్యంలోనే.. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు బయట పడుతున్నాయి. జనసేన, బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీల క్యాడర్, నేతల మధ్య వివాదాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల జనసేన వర్సెస్ టిడిపి, మరికొన్నిచోట్ల టిడిపి వర్సెస్ బిజెపి, అలాగే కొన్నిచోట్ల జనసేన వర్సెస్ భారతీయ జనతా పార్టీ అన్నట్లుగా వ్యవహారం నడుస్తుందట. అలా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా... వివాదాలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను మొదట టిడిపి ఆశించింది. టికెట్ కోసం పెద్ద పోరాటమే చేసింది టిడిపి.
కానీ చివరి క్షణంలో వైసిపి నుంచి జనసేన పార్టీలో చేరిన ఆరాణి శ్రీనివాసులకు... తిరుపతి టికెట్ లభించింది. ఎన్నో పరిణామాల మధ్య జనసేన అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులును టిడిపి గెలిపించగలిగింది. అయితే.. ఎన్నికల కంటే ముందు టిడిపి నేతలు రచ్చ చేశారని మనసులో పెట్టుకున్న జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు... ఇప్పుడు వారి పైన పగ తీర్చుకుంటున్నారట.
అభివృద్ధి కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఛాన్స్ ఇవ్వడం లేదట. వాళ్లకు ఆహ్వానం కూడా అందించకుండా.. వైసీపీలో ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారట ఆరాణి శ్రీనివాసులు. దీంతో టిడిపి పార్టీ నేతలు... ఫైర్ అవుతున్నారట. తమతో మాట్లాడకుండా సరే కానీ... వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కాదని తెలుగుదేశం పార్టీ నేతలు... చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారట. అయినా కూడా ఆరాని శ్రీనివాసులు... తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారట. అంతేకాకుండా అడుగడుగునా తెలుగుదేశం తమ్ముళ్లకు... ఆటంకం కలిగిస్తూ టిడిపి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారట.