దువ్వాడ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ బ్యాక్‌ గ్రౌండ్ ?

frame దువ్వాడ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ బ్యాక్‌ గ్రౌండ్ ?

Veldandi Saikiran
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కలకలం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అక్రమ సంబంధం గట్టు బయటపడింది. గత రెండేళ్లుగా కుటుంబంలో విభేదాలు నెలకొంటున్నాయని సమాచారం. దీంతో ఎమ్మెల్యే దువ్వాడ శ్రీను, బార్య జెడ్పిటిసి దువ్వాడ వాణి వేరు వేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వరుసగా ఇంచార్జ్ లను మార్చారు వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.

ఇక ఎన్నికల్లో తనకు టిక్కెట్ కావాలని కోరారు  వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి.  భర్తపై  రెబల్ గా దిగుతానంటూ గతంలో లీకు ఇచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌. అధిష్టానం  సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌. అయితే... గురువారం అంటే నిన్న రాత్రి తండ్రి తమ వద్దకు రావాలంటూ  దువ్వాడ కార్యాలయం ముందు నిరసనకు దిగారు దువ్వాడ కూతుర్లు. తమ తండ్రి మరో వైసీపీ మహిళా నేతతో ఉంటూ.. తమని దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ భార్య వాణి, కుమార్తె హైందవి.

ఈ ఇష్యూపై దువ్వాడ వాణి మాట్లాడుతూ... బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించానని.... ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో దువ్వాడ అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా బాధించిందని వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన పనితో తమ పిల్లలు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. మేం దువ్వాడను ఇంటి నుంచి పంపించలేదని క్లారిటీ ఇచ్చారు. పలాస లో కూడా తమ పిల్లలపై ఇబ్బందికరంగా దువ్వాడ బ్రదర్స్ ప్రవర్తించారని ఆగ్రహించారు.

ఇప్పుడు తన పిల్లలు తండ్రితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారని... ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నామని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో కనీసం దువ్వాడ  శ్రీనివాస్ గెలవాలనే పోటీ కి దూరంగా ఉన్నానని తెలిపారు. కాగా దువ్వాడ శ్రీనివాస్‌ అక్రమ సంబంధం పెట్టుకుంది దివ్వల మాధురి అనే వైసీపీ పార్టీ లీడర్‌తోనేనని సమాచారం. గతంలో దివ్వల మాధురి‌కి మహిళ అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారట. అప్పుడు అక్రమ సంబంధం వ్యవహారం బయటకు వచ్చిందట.. దీంతో నాడు పదవికి రిజైన్‌ చేసారట మాధురి. ఇక ఇప్పుడు మళ్లీ తెరపైకి ఇదే అంశం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: