ఏపీ: కొత్త జంటకు ప్రభుత్వం కీలకమైన ప్రకటన.. ఏమిటంటే..?

Divya

ఏపీ ప్రజలకు వరుసగా ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేస్తోంది.. పేదలకు అండగా చంద్రబాబు నిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసేలా పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే వివాహమైన కొత్త జంటలకు ఒక గుడ్ న్యూస్ సైతం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల జారీ పైన కీలకమైన ప్రకటనను కూడా తెలియజేయడమే కాకుండా ఒక శుభవార్తను కూడా కొత్త జంటలకు తెలియజేశారు.

రాష్ట్రంలో కొత్త కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్న సమయంలో వీటి పైన కీలకమైన అడుగులు వేస్తూ వచ్చారు ఏపీ సర్కార్.. నిత్యవసర సరుకులకు రేషన్ బియ్యానికి రేషన్ కార్డ్ ఉపయోగపడడమే కాకుండా ప్రభుత్వ పథకాలకు కూడా రేషన్ కార్డ్ ఉపయోగపడుతుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేయబోతున్నారు.

సరికొత్త డిజైన్తో ఈసారి ఏపీ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారట. కొత్త రేషన్ కార్డుల విషయంలో పెళ్లయిన కొత్త జంటలకు మొదటిసారి ప్రాధాన్యత ఇస్తూ ఉమ్మడి కుటుంబంలో కాకుండా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకి ఉండేలా ప్రభుత్వం చూస్తా ఉందట. ఇక మీదట రేషన్ షాపులలో రాగులు జొన్నలు, సజ్జలు కూడా  అందించే విధంగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెల నుంచి పంచదారతో పాటు వీటన్నిటిని పంపిణీ చేయాలని అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయి మాట్లాడారు. అలాగే రేషన్ షాపులకు రాలేని వారికి మాత్రమే ఇంటి దగ్గరికి వెళ్లి రేషన్ ఇవ్వాలి అంటూ అధికారులను సూచించారట ఏపీ సీఎం. అలాగే త్వరలోనే 6000 మంది కొత్త రేషన్ డీలర్లను నియమించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: