బొత్సకు చెక్ పెట్టడానికి చంద్రబాబు వ్యూహాలివేనా.. ఉత్కంఠకు చెక్ పడుతుందా?

frame బొత్సకు చెక్ పెట్టడానికి చంద్రబాబు వ్యూహాలివేనా.. ఉత్కంఠకు చెక్ పడుతుందా?

Reddy P Rajasekhar
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థి ఎంపిక కొరకు కసరత్తును మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం. శనివారం సాయంత్రం సమయానికి ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
 
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబు ముందడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అర్బన్ ఓట్లతో పాటు రూరల్ ఓట్ల గురించి పార్టీ కేడర్‌తో సమీక్ష నిర్వహించినట్టు సమాచారం అందుతోంది. వైసీపీ సైతం ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కొసమెరుపు.
 
ఈ మధ్య కాలంలో స్థాయి సంఘం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి వైసీపీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎంపీటీసీలను, సర్పంచ్ లను ఇప్పటికే వైసీపీ క్యాంప్ లకు తరలించిందంటే జగన్ ఎంత జాగ్రత్తగా రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ నెల 30వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుండగా వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది.
 
బొత్స సత్యనారాయణను ఢీకొట్టే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని ఎలాంటి విమర్శలకు తావివ్వకూడదని చంద్రబాబు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జీవీఎంసీ స్థాయీ సంఘం కమిటీ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేస్తామని కూటమి నేతలు చెబుతుండటం కొసమెరుపు. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.  ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల గురించి సోషల్ మీడియా వేదికగా కూడా ఒకింత ఎక్కువగానే చర్చ జరిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: