గోదావరి వైసీపీలో బిగ్ వికెట్ డౌన్.. జగన్‌ను పీల్చి పిప్పి చేసిన టాప్ లీడర్.?
ఈ ఎన్నికలలో ఆయన టిడిపి నుంచి పోటీ చేసిన బడేటి చంటి చేతిలో ఏకంగా 60 వేల పై చిలుకు ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఆళ్ల నాని వైసీపీని... జగన్‌ను చాలా బాగా వాడుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆళ్ల నానికి రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. 2014లో నాని వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా జగన్ నానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.. 2019 ఎన్నికలకు ముందు ఏలూరు ఎమ్మెల్యే టికెట్‌ను మధ్యాహ్నపు ఈశ్వరి బలరాంకు ఇవ్వాలి అనుకున్నారు.
అయితే నాని బెదిరించి ఎన్నికలకు ముందు మరోసారి ఎమ్మెల్యే టికెట్ సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికలలో నాని జగన్ గాలిలో కూడా కేవలం 3000 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అనంతరం నానికి ఏలూరు జిల్లా వైసీపీ పగ్గాలు జగన్ అప్పగించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. మూడేళ్ల పాటు మంత్రిగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన నాని మంత్రి పదవి పీకేసిన వెంటనే చివరి రెండేళ్లు అసలు ప్రజల్లోకి రాలేదు.
అసలు ఈ ఎన్నికల్లో కూడా నానికి సీటు ఇవ్వాలా వద్దు అంటూనే జగన్ సీటు ఇచ్చారు. ఎన్నికల్లో నాని ఓడిపోయిన వెంటనే ఇప్పట్లో రాజకీయాల్లో కోలుకునే అవకాశం లేదని భావించి చాలా తెలివిగా వైసీపీకి గుడ్ బై చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఏది ఏమైనా జగన్ ను చాలా తెలివిగా వాడుకుని అవసరం తీరాక జగన్‌కు బై బై చెప్పిన వారిలో ఆళ్ల నాని తొలి జాబితాలో ఉంటాడు అని చెప్పాలి.