స్వాతంత్య్ర వేడుకలను.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేసిన ప్రధాని మోదీ?
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోదీ ఓ క్యాంపెయిన్‌ను కూడా స్టార్ట్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ పిక్ మార్చుకుని ట్రెండ్ సెట్ చేశారు. దేశ ప్రజలంతా ఇలా ప్రొఫైల్ పిక్ మార్చుకుని దేశ ఐక్యతను చాటాలని మోదీ దిశానిర్దేశం చేశాారు. ఆ ప్రొఫైల్ పిక్‌లో కూడా మువ్వన్నెల జాతీయ జెండా ఫోటో పెట్టుకుని హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. ఈ ఏడాది నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక సంఘటనగా మార్చాలని మోదీ ప్రజలను కోరారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేయడానికి భారతీయులంతా సిద్దమవుతున్నారు. వేడుకలు గట్టిగా చేసేందుకు దేశం మొత్తం ముస్తాబవుతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎన్‌డీఏ 3.0 సర్కార్ కొలువుదీరాక వస్తోన్న తొలి స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ సారి ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ ఉండనున్నాయి.
ఇక ఇప్పటికే దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆగస్టు 11వ తేది నుంచి 13వ తేది వరకూ తిరంగ యాత్రలు నిర్వహిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రకటించారు. 14వ తేదీన దేశ విభజన సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి జిల్లాలో మౌన దీక్షలుగా నిర్వహించనున్నారు. అలాగే హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని కూడా జాతీయ ఉద్యమంగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా తన ప్రొఫైల్ పిక్ మార్చానని, తనలాగే అందరూ ప్రొఫైల్ పిక్ మార్చుకుని సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన కోరారు.
సెల్ఫీ ఫోటోలను కూడా hargartiranga.comలో షేర్ చేయాలని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేడియోలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 112వ ఎడిషన్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాన్ని జాతీయ పండుగగా జరుపుకోవాలని కోరారు. ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సర్టిఫికెట్ కూడా పొందొచ్చు. ఆన్‌లైన్‌లో హర్ ఘర్ తిరంగ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా hargartiranga.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో 'click to participate' బటన్‌పై క్లిక్ చేయాలి. పేరు, ఫోన్ నంబర్, రాష్ట్రం, దేశాన్ని నమోదు చేశాక ప్రతిజ్ఞ చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ పొందొచ్చు. సెల్ఫీలను కూడా అప్లోడ్ చేయొచ్చు.