వామ్మో: మీడియా రంగంలోకి మెగా బ్రదర్.. జనసేన కి కలిసొస్తుందా..?

Divya
మెగా బ్రదర్ నాగబాబు ఒకవైపు సినిమాలలో మరొకవైపు నిర్మాతగా , రాజకీయంగా కూడా బాగానే పేరు సంపాదించారు. టీవీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరించారు నాగబాబు. తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ జనసేనలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎన్నికలలో జనసేన పార్టీ గెలుపులో కూడా కీలకమైన పాత్ర పోషించారు నాగబాబు. తాజాగా నాగబాబు గురించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇప్పటికే పలు రకాల యూట్యూబ్ చానల్స్ పెట్టి కొత్త వాళ్లను సైతం ఎంకరేజ్ చేస్తూ పలు రకాల షార్ట్ ఫిలింలో వెబ్ సిరీస్ లు వంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా N మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నారనే విధంగా ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేస్తూ N మీడియా లోగోని రివీల్ చేశారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి ఎన్ని మీడియా ఎంటర్టైన్మెంట్ అంటూ పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్ తో పాటు హెల్త్ న్యూస్ భక్తి న్యూస్ ఇలా ఎన్నో రకాల ఇంటర్వ్యూలను ప్రేక్షకులకు అందించబోతున్నారట. కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వబోతున్నారని రాబోయే రోజుల్లో కచ్చితంగా పొలిటికల్ న్యూస్ ఛానల్ తో ఒక వెబ్సైట్ కూడా స్థాపించేందుకు పలు రకాల సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. N మీడియా వచ్చే ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీకి సపోర్టివ్ గా ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకుంటూ నాగబాబు ఇలా ముందుకు వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు జనసేన పార్టీకి N మీడియా కలిసి వస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: