ఈవీఎం మ్యాజిక్‌.. వైసీపీ అనుమానాలు నిజమేనా?

Chakravarthi Kalyan
ఏపీలో టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సాధించడంతో కొత్త అనుమానాలు ప్రారంభం అయ్యాయి. అధికార వైసీపీ దారుణంగా దెబ్బతిని 11 స్థానాలకే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ స్థాయి ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కూటమి పార్టీలు ఎదురు దాడి కూడా చేశాయి. 2019 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే మీరు గెలిచారా అంటూ ఎదురు ప్రశ్నించాయి.

అయితే భారీ ఓటమిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెర వెనుక ఏదో జరిగిందని ఆ పార్టీ అధినేత జగనే స్వయంగా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 20 వేల మెజార్టీ తగ్గకుండా.. 95 వేల వరకు గరిష్ఠంగా నమోదు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈవీఎంలలో ఏదో కుట్ర జరిగిందనే అనుమానాలతోనే చాలా మంది ఇప్పటికే నమ్ముతున్నారు. ఈ మేరకు పలు సర్వే సంస్థలు ఓట్ల లెక్కింపులో తేడా జరిగిందని గణాంకాలతో సహా చెప్తే వీరి అనుమానాలు మరింత బలపడ్డాయి.

మే 13న పోలింగ్ జరిగింది. మూడు వారాల తర్వాత జూన్ 4న ఓట్లను లెక్కించారు. అయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో చాలా ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు వైసీపీ నేతలు గుర్తించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.

వైసీపీ అభ్యర్థిగా విజయనగరం నుంచి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్.. ఈవీఎం ఛార్జింగ్ వ్యవహారంపై విచారణ కోసం జూన్ 10న రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రూ.5,66,400 ఫీజు చెల్లించారు. బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి శంబంగి చిన్న అప్పలనాయుడుతో పాటు పలువురు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే విచారణ ముందు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. చాలా మంది అధికారులు ఫిర్యాదు దారులకు ఫోన్  చేసి వాటిని వెనక్కి తీసుకోవాలని.. చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా బయట పెట్టారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటో త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: