ఇజ్రాయెల్‌ యుద్ధం.. మోదీ కీలక నిర్ణయం?

frame ఇజ్రాయెల్‌ యుద్ధం.. మోదీ కీలక నిర్ణయం?

Chakravarthi Kalyan
హమాస్ ని అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్నయుద్ధం ప్రారంభించి ఆరు నెలలు దాటింది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులను వెతికీ మరీ పట్టుకొని చంపుతోంది. ఈ క్రమంలో హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియా హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఇటు హమాస్ తో పాటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై రగిలిపోతుంది.  హనియాను ఇజ్రాయెల్ బలగాలే చంపాయని ఇరాన్ అనుమానిస్తోంది.

అమెరికా కూడా ఇందుకు సాయం చేసింది భావిస్తోంది. ఫహద్, హనియా హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడులు భయంకరంగా ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు యుద్ధం వస్తే ఇజ్రాయెల్ కు ఏ సాయమైనా చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని జో బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆచుతూచి వ్యవహరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్లా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర ఇజ్రాయెల్ లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించింది.

తాజాగా మోదీ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కి భారత్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లొద్దని భారతీయులకు సూచించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంటే అక్కడ ఏం జరగబోతుందో మోదీకి ముందే తెలుసు. అందుకే ఎప్పుడు లేనిది ప్రయాణికులపై ఆంక్షలు విధించారు.

అందుకే ముందు జాగ్రత్త చర్యగా విమానాలను రద్దు చేశారు. ఇజ్రాయెల్ లోని టెల్ అవీన్ కు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేనందున భారత్ నుంచి తమ విమానాలను రద్దు చేసుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితులును తాము గమనిస్తున్నామని.. ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చెల్లిస్తున్నాం అని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇక గత వారమై టాటా ఎయిర్ లైన్స్ కూడా తాము ఇజ్రాయెల్ కు విమానాలు నడపబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: