ఇకమీదట గాజు గ్లాస్ గుర్తు జనసేనదే..!
ముఖ్యంగా ఇలాంటి విషయాల పైన కోర్టులకు ఏమి సంబంధం అంటూ ప్రశ్నించింది..?ఎలక్షన్ సింబల్ విషయంలో అభ్యంతరాలు ఉంటే అవి ఎలక్షన్ ట్రిబ్యునల్ ముందే లేవలెత్తాలి తప్ప కోర్టుల ముందు కాదని తేల్చి చెప్పేసింది. ఈసి ఈ విషయాన్ని హైకోర్టులో సైతం వాదించింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసిందట.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో పిటిషన్ తన అభ్యర్థరాలను ట్రిబునల్ ముందు లేవలెత్తాలి తప్ప. బయటకాదంటూ తేల్చి చెప్పేసిందట. దీని మీద అధికారికంగా 226 హైకోర్టు ఆశ్రయించడానికి వీలు లేదంటూ తేల్చి చెప్పేసిందట.
ఈసీ చెప్పిన ఈ వివరాలను పరిగణంలోకి తీసుకున్న హైకోర్టు.. ఇది అఫిడవిట్టుగా తమ ముందు ఉంచమని జాయింట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లను ఆదేశాలను జారీ చేసింది. దీని ఆధారంగా తమ ముందు ఉన్నటువంటి అఫిడవిట్ల ఆధారంగా లెక్క తీసుకుంటామని.. తేల్చి చెబుతూ ఈనెల 13న వాయిదా వేసింది. దీంతో ఈ గాజు గ్లాసు గుర్తుకోసం పిటిషన్ వేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, దళిత బహుజన పార్టీలు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.