జగన్‌ రూట్‌ క్లియర్‌ చేస్తున్న స్పీకర్‌ అయ్యన్న?

frame జగన్‌ రూట్‌ క్లియర్‌ చేస్తున్న స్పీకర్‌ అయ్యన్న?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డి.. చాలా కాన్ఫిడెంట్గా ఎన్నికల కంటే ముందు ఉన్నారు. ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా కచ్చితంగా.. అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించారు. కానీ రియాల్టీలో.. వైసిపి పార్టీకి ఎదురుదెబ్బే తగిలింది. వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు రావడం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.

అటు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలకే వైసీపీ పడిపోయింది. ఈ తరుణంలో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాలేదు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు. ఏపీలో ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వాలని ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం... జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేలా కనిపించడం లేదు.
 

చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలపై కేసులు కూడా పెడుతోంది. అయితే... ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట ఇచ్చారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆయనకు తగిన అవకాశం ఇస్తానని.. బంపర్ ఆఫర్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావచ్చని.. అందులో ఎలాంటి డౌట్ లేదన్నారు.

టిడిపి ఎమ్మెల్యేలకు ఇచ్చిన సమయమే... అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇస్తానని హామీ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు. జగన్మోహన్ రెడ్డి పైన.. ఎలాంటి వివక్ష అసెంబ్లీలో చూపించబోనని కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు గెలిచిన మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యల కోసం అయినా అసెంబ్లీకి రావాలని తెలిపారు.  అలా  వస్తేనే వారి నియోజకవర్గాల ప్రజలకు... న్యాయం జరుగుతుందన్నారు.మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: