ఏపీ : ఇది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటూ మాజీ సీఎం సంచలన ట్విట్..!
సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే రైతులకు చాలా నష్టం కలుగుతోందని రైతులు బాగుంటేనే రాష్ట్రమంతా కూడా బాగుంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు అంటు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమాను కూడా ఇప్పటివరకు అసలు చెల్లించలేదు దీనివల్ల రైతులు క్రాఫ్ ఇన్సూరెన్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుంది అంటూ తెలియజేశారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఏటా కూడా ఏప్రిల్ నుంచి మే నెలలో చెల్లించే వారమని నష్టపోయిన రైతులకు జూన్ నెలలో ఆదుకునేవారమంటు తెలియజేశారు.
ఉచిత పంటల బీమా ప్రియమైన సైతం ప్రభుత్వమే చెల్లించి చాలా సమర్థవంతంగా అమలు చేశాము..రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన తరువాతే కేంద్రం కూడా వెంటనే తన వాటాను విడుదల చేస్తూ ఉండేదని.. ఇలా కేవలం ఒక్క నెల వ్యవధిలోనే బీమా కంపెనీ పంట నష్టాన్ని సైతం రైతులకు చెల్లించే వారిని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల మంది రైతులకు ఎన్నడూ లేని విధంగా 7,802 కోట్ల రూపాయలను సైతం అందించామంటూ తెలియజేశారు. ఈ సంవత్సర కాలంలో కోస్తాలో అతివృష్టి రాయలసీమలో కరువు వల్ల చాలా పంటలు సైతం దెబ్బతిన్నాయని ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఆదుకోకుండా ఉండడం వల్లే నష్టపోతున్నారని ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అంటూ తెలియజేశారు. అలాగే రైతులకు పెట్టుబడి కింద ప్రతి ఏటా 20,000 ఇస్తానన్నావ్ మీరిచ్చి ఈ పెట్టుబడి కోసం రైతుల ఎదురుచూస్తున్నారంటూ తెలిపారు.