తె(లు)గులు మీడియా: ఆంధ్రజ్యోతి రూటే సెపరేట్.. వాళ్ళను గెలకడమే టార్గెట్ ?

Veldandi Saikiran
*  ఎల్లో మీడియాగా ఆంధ్రజ్యోతిపై ముద్ర
*  నిత్యం వైసీపీ టార్గెట్ గా abn బాణాలు  
* ఆంధ్రజ్యోతిని టాప్ లోకి తెచ్చింది రాధాకృష్ణనే


రెండు తెలుగు రాష్ట్రాలలో.. ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంధ్రజ్యోతి ఛానల్ తో పాటు.. న్యూస్ పేపర్ కూడా ఉంది.ఈనాడు తర్వాత.. చాలామంది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ రెండు తెలుగు రాష్ట్రాలలో చదువుతున్నారు. అయితే..అలాంటి ఆంధ్రజ్యోతి ఛానల్ చాలా... ఎత్తు పల్లాలను ఎదుర్కొని.. నిలదొక్కు కుంది.
 కష్టాల్లో ఉన్న... ఆంధ్రజ్యోతి ఛానల్ ను... పైకి లేపింది ఏబీఎన్ రాధాకృష్ణ గారు. సాధారణ సబ్ ఎడిటర్ గా... తన కెరీర్ ప్రారంభించిన  ఏబీఎన్ రాధాకృష్ణ ఆ తర్వాత దాని చైర్మన్గా మారిపోయారు. అయితే.. ఆంధ్రజ్యోతి ఛానల్ అలాగే న్యూస్ పేపర్ మొదటి నుంచి... చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని.. ప్రజలే కాకుండా.. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.
 చంద్రబాబుకు కష్టం వస్తే... ఆంధ్రజ్యోతి ఛానల్ అలా వాలిపోతూ ఉంటుందట. జనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు... జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక వార్తలను ప్రచురించినట్లు ఏబీఎన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఐదు సంవత్సరాల పాటు ఏబీఎన్ పై బ్యాంకు కూడా విధించారు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ యూట్యూబ్ ద్వారా జనాల్లోకి జగన్ మోహన్ రెడ్డి.. చర్యలను తీసుకువెళ్లగలిగింది ఏబీఎన్.
 సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న వ్యతిరేకతను జనాల్లోకి... చాలా బలంగా తీసుకువెళ్లిన ఛానల్లో ఒకటి ఏబీఎన్ అని... రాజకీయ విశ్లేషకులు నిత్యం చెబుతూ  ఉంటారు. ఆంధ్రజ్యోతి ఛానల్ వల్లే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడని కూడా అంటున్నారు. ఇక ఇప్పుడు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. టిడిపి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఏబీఎన్ వ్యవహరిస్తోందని... జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఇటు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా కూడా వ్యవహరిస్తోందని... ఏబీఎన్ రాధాకృష్ణ పై ప్రత్యేకమైన ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: