తె(లు)గులు మీడియా:లక్ష్యాన్ని మార్చుకున్న 'మహా' మీడియా..ఆ ఒక్క తప్పే చేస్తుందా.?

frame తె(లు)గులు మీడియా:లక్ష్యాన్ని మార్చుకున్న 'మహా' మీడియా..ఆ ఒక్క తప్పే చేస్తుందా.?

Pandrala Sravanthi
- మహాసముద్రం లాంటి మహాన్యూస్.
- ప్రజా సమస్యలు వెలికి తీసే ధైర్యం ఉన్న ఛానల్.
- ఒక్క తప్పు చేస్తూ మైనస్ అవుతుందంటున్న ప్రజలు..!

 ఒకప్పుడు ఒక మీడియా వ్యక్తి సమస్య ఉన్న దగ్గరికి వచ్చాడు అంటే తప్పనిసరిగా ఆ సమస్య క్లియర్ అవుతుందనే భరోసా ప్రజలకు ఉండేది. ఆ విధంగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా మీడియా సంస్థ కీలక పాత్ర పోషించేది. అంటే ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధి  వేసేది మీడియా సంస్థలే. అలా మీడియా అంటే గౌరవం, తప్పు చేసేవారికి భయం ఉండేది. అలాంటి ఈ మీడియా సంస్థల్లో మార్పు వచ్చింది. ప్రజా సమస్యలను వెలికి తీసే  పనులను మానుకొని, నాయకులకు డబ్బాలు కొట్టే వార్తలనే   ప్రచురితం చేస్తున్నారని అపోహ ప్రజల్లో ఉంది. చివరికి మీడియా వాళ్ళను కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితికి వచ్చారంటే, సంస్థలపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే మాత్రం  రాను రాను రోజుల్లో అసలు మీడియా సంస్థను, ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు.  అంతేకాదు రాజకీయ నాయకులు ఈ మీడియాను మరింత చులకన చేసి, చివరికి వాళ్లే రాజులుగా అడ్డు అదుపు లేకుండా అక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీడియా సంస్థలు ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రభుత్వాలు చేసే తప్పులను, ప్రజలకు జరిగే అన్యాయాలను తప్పక వెలికి తీయాలని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
 'మహా' కూడా కూటమికే సపోర్ట్ ఇచ్చేనా.?
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎక్కువ భాగం  చాలా మీడియా ఛానల్స్ జగన్ కు యాంటీగా పని చేశాయని ప్రజల్లో ఒక భావన కలిగింది. అందులో 'మహా' న్యూస్ కూడా ఉంది.  ఒకప్పుడు ఈ న్యూస్ ఛానల్ ఏ ప్రభుత్వానికి తొత్తుగా పని చేయదు అనే భావన ప్రజలలో ఉండేది. మిగతా చానల్స్  ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి డబ్బా కొడుతుందనే  భావన ఉన్నా కానీ మహా న్యూస్ పై ప్రజల్లో మంచి భావన ఉండేది. తప్పక ప్రజా సమస్యలు వెలికి తీసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని  చాలామంది భావించేవారు.  అలాంటి 'మహా'న్యూస్ తన పంతాను మార్చుకొని  మొన్నటి ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేసి జగన్ కు యాంటీగా వర్క్ చేసిందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా మహాన్యూస్ కు ఈ ఒక్క మైనస్ తప్ప, మరో విధంగా నిందించడానికి లేదు.  మరి దీని నుంచి కూడా మహా న్యూస్ బయటపడి నిష్పక్షపాతంగా వార్తలు ప్రసారం చేస్తే మాత్రం ప్రస్తుతమున్నటువంటి మీడియా ఛానల్స్ అన్నింటికంటే ఇది హైలైట్ అయ్యే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ న్యూస్ ఛానల్ ఇప్పటికైనా మారుతుందా లేదంటే తన పంథాను అలాగే కొనసాగిస్తుందా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: