తె(లు)గులు మీడియా: ప్రజాపక్షమా..?రాజకీయపక్షమా..?

Divya
•మీడియా ప్రజాపక్షమా..
•రాజకీయ పార్టీలకు వంతు పాడుతోందా..
* ప్రజలకు  నిజాన్ని చెప్పేదెవరు..?


(ఇండియా హెరాల్డ్ - ఆంధ్ర ప్రదేశ్)
మీడియా.. మీడియా అంటే ఒకరికి వంతు పాడేది కాదు.. ఎవరికి భయపడేది కూడా కాదు. నిజాన్ని నిర్భయంగా బయటకు చెప్పగలిగేదే మీడియా. అందుకే చాలామంది మీడియానే నమ్ముతారు.  బయట వ్యక్తులను నమ్మకుండా అసలు ఏం జరిగింది అనే నిజాలను ఆరాతీసి మరీ వార్తాపత్రికల్లో తెరకెక్కిస్తూ ప్రజలకు నిజానిజాలను తెలియజేసే గొప్ప సాధనం మీడియా. ముఖ్యంగా రాజకీయ రంగం విషయానికి వస్తే,  రాజకీయాలలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేసే వాహకం అనడంలో సందేహం లేదు. మీడియా అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కాదు.  అసలు ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేయాలని ప్రజలు  ఆకాంక్షిస్తున్న విషయం తెలిసిందే.
ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఆవిర్భవిస్తున్నాయో అన్ని మీడియా ఛానల్స్ కూడా పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే కొన్ని మీడియా ఛానల్స్ ప్రత్యేకించి,  కొన్ని పార్టీల వారి కోసమే పనిచేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యం అనిపించింది. అయితే ఇలా ఎన్నో పార్టీలు పని చేయడం వల్ల ఆ పార్టీల్లో జరిగే నేరాలు ఘోరాలు దాచిపెట్టి , వారు చేసే మంచి పనులను మాత్రమే హైలెట్ చేస్తూ వారి కోసమే పనిచేస్తున్నాయి. దీనివల్ల ప్రజలు తప్పుదోవ  పట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా చాలా పత్రికలు కొన్ని పార్టీలకు మద్దతుగా ప్రకటిస్తూ.. ఆ పార్టీల కోసమే పని చేస్తూ.. వారు చెప్పే విషయాలను మాత్రమే ప్రజలకు చేరవేస్తున్నారు. లోపల జరిగే కుమ్మక్కుల గురించి ప్రజలకు చెప్పకపోవడం వల్లే ప్రజలు డైలమాలో పడుతున్నారని చెప్పాలి. ఫలితంగా ఎన్నికల సమయంలో వీరు చేసే ప్రచారాల కారణంగా ప్రజలు తప్పుదోవ పట్టి, ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  అంతేకాదు ఎవరో ఒకరిని ఎన్నుకోవడం వల్ల అభివృద్ధి జరగక, సకాలంలో సరైన పనులు అమలు కాక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే చాలామంది, మీడియా ఉన్నది ఉన్నట్టు ప్రచారం చేయాలని లేనిపోని అసత్యాలు ప్రచారం చేయకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. తాజా జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మీడియా ప్రజాపక్షమా? లేక రాజకీయ పక్షమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం.  మరి ఇకనైనా మీడియా నిజాన్ని నిర్భయంగా బయటకి చెప్పాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: