తే(లు)గులు మీడియా : పార్టీ మారితే విషయం మారాల్సిందేనా..?
దానితో వారు ఇతర మీడియా సంస్థలపై ఆధారపడకుండా వారికి సంబంధించిన న్యూస్ నే వారే ప్రచారం చేసుకోవడం ద్వారా జనాలకు ఆది చాలా సులువుగా చేరుతుంది అనే ఉద్దేశంతో ఎంతో మంది పొలిటికల్ లీడర్లు కూడా మీడియా సంస్థలను మెయింటైన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని మీడియా సంస్థలు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లేదా నేతకు అండదండగా పని చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి సపోర్ట్ చేసిన మీడియా సంస్థ ఆ వ్యక్తి కనుక వేరే పార్టీలోకి వెళ్లినట్లు అయితే ఆ తర్వాత వారు కూడా అదే పార్టీకి సపోర్ట్ చేస్తూ న్యూస్ రాస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రాజకీయ నాయకులకు , ప్రజలకు మధ్య మీడియా సంస్థలు అనేవి వారధిలా పని చేస్తున్నాయి. వాటి ద్వారానే ప్రజల వద్దకు న్యూస్ చేరుతూ ఉంటుంది.
కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కువ శాతం మీడియా సంస్థలపై ఆధారపడుతూ ఉంటారు. దానితో మీడియా సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు లేకపోయినా కనీసం వారికి సంబంధించిన విషయాలను ప్రచారం చేసుకోవడానికి అయినా పనికొస్తాయి అని వాటిని మైంటైన్ చేసే వారు కూడా అనేక మంది ఉన్నారు.
అలా మీడియా సంస్థలలో చాలా వరకు ఒక పార్టీ కి లేదా ఒక వ్యక్తి కి సపోర్ట్ చేస్తూ వారికి పాజిటివ్ గా ఉన్న మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. ఇక మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షంగా నిలబడుతూ మంచి ని నిలదీసి అడిగే విధంగా పని చేస్తున్న మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.