విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీకి భారీ షాక్‌.. బొత్స ఓట‌మి ప‌క్కానా..?

frame విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీకి భారీ షాక్‌.. బొత్స ఓట‌మి ప‌క్కానా..?

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష వైసిపికి షాకులు మీద షాకులు తగులుతున్నాయి... మాకు స్థానిక సంస్థల ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ ఉంది కచ్చితంగా గెలిచేస్తాం.. గెలిచి తీరుతాం అని ప్రగ‌ల్భాలు పలుకుతున్న వైసిపికి గట్టి దెబ్బ‌ పడింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో ఎంపీపీ - వైస్ ఎంపీపీలు ... పలువురు సర్పంచులు వైసీపీకి షాక్ ఇచ్చారు. మునగపాక మండలం ఎంపీపీ మళ్ల జయలక్ష్మి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. వైస్ ఎంపీపీలు బాడ లక్ష్మి - చిందాడ దేవి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు .. ఉపసర్పంచ్‌లు... వార్డ్ మెంబర్లు కూడా వైసిపి వద్దనుకుని జనసేనలో చేరిపోయారు.

వీరందరికీ పార్టీ కండువా కప్పి ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలనలో ఇప్పటివరకు కొనసాగినందుకు చాలా సిగ్గుపడుతున్నామని ఆ పార్టీని వీడిన నేతలు మీడియాకు చెపుతున్నారు. వైసిపి అరాచక పాలనలో ఇప్పటివరకు కొనసాగినందుకు చాలా సిగ్గుపడుతున్నామని ఆ పార్టీని వీడిన నేతలు మీడియాకు చెపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి పార్టీలు వర్సెస్ వైసీపీ మధ్య జరుగుతున్న ఎన్నిక కావడంతో సహజంగానే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి రేపుతోంది.

పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్ ... ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను దెబ్బ కొట్టి సత్తా యేంటో చూపించాలని టిడిపి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఎలాగైనా గెలిచి తీరాలని వైసిపి గట్టిగా ట్రై చేస్తోంది. మరోవైపు కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేస్తారు ? ఇక్కడ జనసేన, టిడిపి, బిజెపి ఎలా కలిసి పనిచేస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే బలం లేకపోయినా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించింది. ఇదే ఊపుతో ఎమ్మెల్సీ పదవి గెలిపించుకుంటామని విశాఖ జిల్లాకు చెందిన స్థానిక నాయకులు చంద్రబాబుకు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో కూడా కూటమి ఘనవిజయం సాధిస్తే వైసిపి కి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: