ఏపీ: భారీగా ఆ శాఖలో ఉద్యోగ నియామకానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం..!

frame ఏపీ: భారీగా ఆ శాఖలో ఉద్యోగ నియామకానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం..!

FARMANULLA SHAIK
ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగ కల్పనకు అడుగులు వేస్తోంది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌కు అనుగుణంగా మెగా డీఎస్సీ వేసిన ఉపాధ్యాయ ఖాళీలను భ‌ర్తీ చేస్తుండ‌గా, ఇప్పుడు పోలీస్ శాఖ‌లో పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ నియామ‌క ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్ట‌బోతుంది.గ‌త వైసీపీ ప్ర‌భుత్వం 2022 న‌వంబ‌ర్ 28న పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే దీనిపై కోర్టులో కేసులు వేశారు. అయిన‌ప్ప‌టికీ ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించారు. అలాగే ఫ‌లితాలు కూడా విడుద‌ల అయ్యాయి. ఆ త‌రువాత నిర్వ‌హించాల్సిన మెయిన్స్ రాత ప‌రీక్ష జ‌ర‌గ‌లేదు. ఈలోపు రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. అంతే వాటికి అతీలేదు, గ‌తీలేకుండా పోయింది.పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్రిలిమ్స్ ప‌రీక్ష 2023 జ‌న‌వ‌రి 22న జ‌రిగింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజ‌రయ్యారు. ఫిబ్ర‌వ‌రి 5న ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌లయ్యాయి.  మొత్తం 95,208 మంది అభ్య‌ర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి దేహ‌దారుఢ్య‌, శారీర‌క సామ‌ర్థ్య (పీఎంటీ, పీఈటీ) ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది.
అయితే 2023 మార్చి 13 నుంచి 20 వ‌ర‌కు దేహ‌దారుఢ్య‌, శారీర‌క సామ‌ర్థ్య (పీఎంటీ, పీఈటీ) ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని షెడ్యూల్ విడుద‌ల చేశారు. దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. అయితే స‌రిగ్గా అప్పుడే రాష్ట్రంలో గ్రాడ్యూట్ (ప‌ట్ట‌భ‌ద్రుల‌) ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో ఆ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. అయితే అప్ప‌టి నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్య‌ర్థులు ఎదురు చూస్తునే ఉన్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు కూడా పోలీస్‌కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి స్పందించారు.రాష్ట్ర పోలీస్ శాఖలో కొత్త నియామకాలు చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే కానిస్టేబుల్స్ నియామ‌కాలుంటాయ‌ని డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు ప్ర‌క‌టించారు. రాయ‌ల‌సీమ ఎస్పీల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించిన ఆయ‌న‌, నియామ‌కాల‌పై ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు గంజాయి సాగును అరికట్టాల్సిన అవసరం ఉంది. మహిళ’పై అఘాయిత్యాల’ను అదుపులో ఉంచేలా చర్య చేప’ట్టామ’న్నారు.ఇవాళ రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్విహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా యువతను చిదిమేస్తున్న గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: