విశాఖ : ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి టీడీపీ ఔట్..బాబు భయపడ్డాడా?
టిడిపి కూటమి పక్షాల బలం చాలా తక్కువగా ఉందని.. నారా చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చారట. వాస్తవానికి ఈ ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం అలాగే ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, అటు జడ్పిటిసి మరియు ఎంపిటిసి ఓటర్లు ఉన్నారు. వీరందరి లెక్కలు చూస్తే.. వైసీపీకి బలం ఎక్కువగా కనిపిస్తోంది. 60 శాతం పైగా వైసీపీ ఓటర్లు ఉన్నట్లు తెలుగుదేశం కూటమి గుర్తించిందట.
ఇక ఈ లెక్కలు పరిశీలించిన తెలుగుదేశం కూటమి... ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం రిస్కు తీసుకోవాలని అనుకోవడం లేదట. ఈ ఎన్నికల్లో సైడ్ అయిపోవాలని ఓ నిర్ణయానికి వచ్చిందట తెలుగుదేశం కూటమి. దీనికి సంబంధించిన ఓ కథనం... ఎల్లో మీడియాలోనే ప్రచురింపబడింది. అంటే ఈ లెక్కన.. టిడిపి కూటమి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయబోడని అందరూ అనుకుంటున్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నాడు. ఒకవేళ టిడిపి కూటమి తరపున అభ్యర్థి లేకపోతే బొత్స సత్యనారాయణ విజయం ఖాయం అంటున్నారు.