చంద్రబాబు కూటమే జగన్ కు బలమా..భవిష్యత్తు వైసీపీదేనా.?
- కూటమి లేకుంటే వైసీపీదే విజయమా?
- భవిష్యత్తులో పవన్ జగనే కీలకమా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలంటేనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు ఏ పార్టీ ఎలాంటి విజయం సాధిస్తుందో చెప్పడం కష్టం. 2019 ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో అద్భుతమైన విజయం సాధించింది. ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఎన్నో పథకాలను తీసుకువచ్చారు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి పథకాన్ని వారి ఇంటికే చేరేటట్టు చేశారు. అలాంటి జగన్ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన సేవలకు, మళ్లీ ఆయనే గెలుస్తారని చాలామంది భావించారు. కానీ చివరికి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి జగన్ ఓటమిపాలయ్యారు. మరి నిజంగానే టిడిపి కూటమి సొంతంగా గెలిచిందా అంటే అది కాదు. ఇటు పవన్ మరోవైపు బిజెపిని కలుపుకొని ఎన్నికల బరిలోకి వెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి వారి వైపుకు తిప్పుకుంది. ఇలా పవన్ కళ్యాణ్ వల్ల టిడిపికి ఎంతో కలిసి వచ్చి విజయం సాధించింది.
కూటమి కలిసి ఉంటుందా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలుచుకున్నారు. ఆయన ఈ 21 స్థానాల నుంచి 175 స్థానాల్లో పూర్తిస్థాయిలో పోటీ చేసే బలం తెచ్చుకోవాలి. దానికోసం టిడిపిని ఆసరాగా చేసుకొని ఈ ఐదేళ్లలో జనసేన పార్టీని గ్రామం నుంచి మొదలు పట్టణాల వరకు గట్టిగా విస్తరించాలని ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరిస్తే మాత్రం తప్పక టిడిపికి డ్యామేజ్ అవుతుందని చెప్పవచ్చు. పవన్ కాస్త రాజకీయాల్లో బలపడితే మాత్రం ఆయన అనుకున్న ప్లానింగ్ తప్పక ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఇన్ని తెలిసిన వీరు ఐదేళ్లపాటు కలిసి ఉండే అవకాశం ఉందా. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాబోవు ఎన్నికల వరకు గట్టిగా బలపడితే మళ్లీ చంద్రబాబుతో చేతులు కలుపుతాడా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ విధంగా టిడిపి కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఈ ఐదేళ్లపాటు ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు. కానీ జనసేన ఈ ఐదేళ్లలో పూర్తిస్థాయిలో బలపడితే మాత్రం తప్పక టిడిపికి నష్టమే అని చెప్పవచ్చు.