రోజాకు జగన్ చెక్.. నగరిలో కొత్త అభ్యర్థి?
అయితే వైసిపి దారుణంగా ఓడిపోవడం కాకుండా ఆ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ ఓడిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి తప్ప పెద్ద లీడర్లు ఎవరు కూడా గెలవలేకపోయారు. అయితే ఇందులో రోజా కూడా ఓడిపోవడం జరిగింది. రోజా ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నగరి నియోజకవర్గానికి మళ్లీ వెళ్లి కలవలేదు. అసలు కేడర్‌ను పట్టించుకోవడం లేదు రోజా.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చిన్నచిన్న పోస్టులు పెట్టి హల్చల్ చేస్తుంది తప్ప... అసలు పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు. వైసిపి నేతల రోజాను ఓడించాలని ఒక వార్త ఉంది. అందుకే నగరి నియోజకవర్గాన్ని రోజా వదిలిపెట్టినట్లే చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రోజా నియోజకవర్గమైన నగరి విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలం ఎక్కువ.
టిడిపి నేత ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం నగరి నియోజకవర్గం ను ఏలుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ముద్దుకృష్ణమనాయుడు కొడుకు రోజా పైన విజయం సాధించారు. అయితే అలాంటి కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు కొత్త నాయకుడిని... తయారు చేసే పనిలో పడ్డారట జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికలలోపు.. కొత్త నాయకుడిని తెరపైకి తీసుకువచ్చి అక్కడ మళ్ళీ జెండా ఎగురువేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి వైసీపీ పార్టీ నగరి కొత్త అభ్యర్థి ని జగన్ మోహన్ రెడ్డి ఎలా సెలక్ట్ చేస్తాడో చూ డాలి.