ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే 20,000 ఉద్యోగాలు భర్తీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తోంది. రాష్ట్రంలో 20,000 పోలీస్ ఉద్యోగాలు కొరత ఉందని వీటిని త్వరలోనే పూర్తి చేస్తామంటూ హోం మంత్రి అనిత వెల్లడించింది.. త్వరలోనే కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ కూడా వెలబడనున్నట్లు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ పోస్టులను సైతం 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేశారని గత ఏడాది జనవరి 22న ప్రిలిమనరి పరీక్ష కూడా నిర్వహించారని ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా.. మొదటి పరీక్షకి కేవలం 95,209 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

అదే ఏడాది వీరందరికీ  ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ జలపాల్సి ఉండగా పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వళ్ల ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటి పైన చర్యలు తీసుకొని ఈనెల ఆఖరిలో  నియామక పత్రాలను సైతం పునర్ ప్రారంభించాలని ఒక షెడ్యూల్ ని కూడా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఎన్నో ఏళ్లగా ఉద్యోగం కోసం చాలా మంది నిరుద్యోగులు కూడా ఇతర ప్రాంతాలలో ఉంటూ చదువుకుంటూ ఉంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన ఇప్పటివరకు అందుకు సంబంధించిన ప్రక్రియను మాత్రం తెలియజేయలేదు.. మరి ఇలాంటి సమయంలో కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని 20,000 పోలీసు ఉద్యోగాల కొరత ఉందని తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వం ఇందులో ఎన్ని పోస్టులు ఇస్తారా అనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.. ఏది ఏమైనా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది అని చెప్పవచ్చు. అలాగే ఒకవైపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాల మంచి చేకూరాలని పలు రకాల కార్యక్రమాలను చేయబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: