ఆ పథకానికి విరాళాలు అడుగుతున్న ఏపీ సీఎం.. మళ్లీ అలాంటి తప్పేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున అన్నా క్యాంటీన్లను సైతం మొదలుపెట్టారు. దాదాపుగా 99 క్యాంటీన్లను సైతం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. సీఎం భార్య నారా భువనేశ్వరి తో కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్స్ ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలను సైతం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు కడుపు నింపేటువంటి ఈ పథకనికి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి అంటూ పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కేవలం ఐదు రూపాయలకే పేదలకు మంచి భోజనం పెట్టడం కూడా మరింత ఆనందాన్ని కలిగిస్తోందంటూ తెలిపారు.

ఇలా మూడు పూటల అన్న క్యాంటీన్లో ఆహార పదార్థాలతో పాటు ప్రత్యేకమైనను కూడా రూపొందించామని తెలిపారు. వీటిని హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టు అక్షయపాత్ర వారు కూడా నిర్వహించబోతున్నారంటూ వెల్లడించారు.అయితే ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విరాళాలు అందించాలి అంటూ ప్రజల కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని కూడా తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే గతంలో కూడా అమరావతి కట్టడం కోసం విరాళాలు ఇవ్వాలి అంటూ తెలియజేయడంతో ఆ ఎఫెక్ట్ భారీగానే చూపించింది 2024 ఎన్నికలలో.

ఇప్పుడు మళ్లీ అన్నా క్యాంటీన్లు నడపడానికి  మళ్లీ విరాళాలను అడుగుతూ ఉండడంతో చాలామంది ప్రజలు, నేతలు సైతం కౌంటర్లు వేస్తూ ఉన్నారు. గతంలో ఇలాంటి తప్పునే చేశారు చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అదే చేస్తున్నారట .అన్నా క్యాంటీన్లు నడపడం మంచిదే కానీ.. ఇలా విరాళాలు సేకరించి నడపడం వల్ల ఏమి ఉపయోగం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీలతో ప్రజలని మభ్య పెట్టారంటూ వైసీపీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి పథకాలను అమలు చేయకుండా కేవలం కక్ష పూజిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారంటూ వాపోతున్నారు. మరి ఇకనైనా ఏపీ సీఎం చంద్రబాబు తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: