తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకాలు: ప్రాంతీయ పార్టీల గెలుపు ఐటీకి భారీ కుదుపు.!
- ఉద్యోగ కల్పన లేని దేశంగా ఇండియా..
- భవిష్యత్తు ఇవ్వని పార్టీల పాలనతో నిరుద్యోగులు సతమతం..
ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తప్పనిసరిగా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాలి. అభివృద్ధి అనగానే ఏదో ప్రభుత్వం అందించే ఉచితాలు ఇవ్వడం కాదు. తప్పనిసరిగా ఇంటికొక ఉద్యోగం అందే విధంగా ప్రయత్నాలు చేయాలి. తప్పక ప్రతి మనిషికి పని కల్పించాలి. పనికి తగ్గ ఫలితం అందించాలి. పనిచేస్తూ డబ్బులు సంపాదించాలి అనే నినాదం లోకి ప్రజల్ని తీసుకెళ్లాలి తప్ప ఉచితాలు అందిస్తాం, ఇంట్లో కూర్చుండి తినండి అనే నినాదంలోకి ప్రజల్ని తీసుకెళ్లడం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం ఇండియాలో చాలావరకు అదే జరుగుతోంది. చైనా, జపాన్, అమెరికా లాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే, ఇండియా లాంటి దేశాల్లో మాత్రం, ప్రభుత్వం వచ్చి ఉచితాలు ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరింత దారుణమైన విషయం ఏంటంటే నిరుద్యోగ భృతి కూడా అడుగుతున్నారు. దీంతో ప్రభుత్వాలు కంపెనీలను తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనలు మానేసి, ఎక్కడ అప్పుచేసి ఈ పథకాలు అమలు చేయాలనే ఆలోచనకు వచ్చాయి. దీంతో ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇతర దేశాల నుంచి ఎవరు ముందుకు రావడం లేదు. దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా లభించడం లేదు. ముఖ్యంగా ఐటీ రంగంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఐటీకి చుక్కెదురు:
ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, ముంబై వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఐటీ ప్రాబల్యం విపరీతంగా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో ఒక పార్టీ గెలవడం, రాష్ట్రంలో మరో పార్టీ విన్ కావడం. దీంతో చాలామంది ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు తీసుకురావడానికి జెంకుతున్నారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఉన్న ఐటీ రంగం కాస్త తగ్గిపోయింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నటువంటి చాలా ఐటి కంపెనీలు చాలామంది ఉద్యోగాలను పీకేస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రేవంత్ 6 గ్యారంటీలను ఎలా అమలు చేయాలని దృష్టి పెట్టారు తప్ప, ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలని ఆలోచన ఇంతవరకు కూడా చేయలేదు.