మహిళలకు క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. అసలు ఏమైందంటే?

Suma Kallamadi
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అలాగే తమ పథకాలను కూడా ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో మంచి రెస్పాన్స్ వచ్చిన పథకమే మహిళలకు ఫ్రీ బస్సు పథకం. ఈ స్కీమ్‌పై అధికార విపక్షాలు ఫైర్ అవుతుంటే కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కామెంట్స్ చేశారు. అయితే కేటీఆర్ కామెంట్స్‌కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా విచారణకు ఆదేశించింది. ఈ తరుణంలో కేటీఆర్ ఓ అడుగు వెనక్కివేసి తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పారు. పంద్రాగస్ట్ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తాను చేసిన వ్యాఖ్యల వల్ల మహిళలు మనస్తాపం చెందుంటే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అక్కచెల్లెమ్మలకు కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. మహిళల మనస్సు నొచ్చుకుని ఉంటే క్షమించాలని సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ సారీ చెప్పారు.

చాలా రోజుల నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాటల యుద్ధం సాగుతోంది. ఫ్రీ బస్సు స్కీమ్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు, వాళ్ల పని వాళ్లు చేసుకుంటే తప్పేందని అసెంబ్లీ వేదికగా మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. మంత్రి సీతక్క వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కౌంటరిచ్చారు. బస్సులో అల్లంవెల్లుల్లి ఏరితే తప్పని తాను అనలేదంటూ సెటైర్లు వేయడమే కాకుండా మనిషికో బస్సు పెట్టి బ్రేక్  డ్యాన్స్ చేసుకోండని విమర్శలు గుప్పించారు.

దీంతో మహిళలను బ్రేక్ డ్యాన్సులు చేసుకోమంటావా? అంటూ కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగ్ జర్నీలో ఖాళీగా ఉండకుండా పనులు చేసుకుంటే తప్పేందని, కేటీఆర్ ఇళ్లల్లో ఆడపడుచులు లేరా అని  కేటీఆర్ పై  సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: