అన్న క్యాంటీన్ల విషయంలో విమర్శలు చేస్తే వైసీపీకే నష్టం.. టార్గెట్ చేయొద్దంటూ?

Reddy P Rajasekhar
పేద ప్రజలకు పట్టెడన్నం మూడు పూటలా పెట్టాలనే మంచి ఆలోచనతో కూటమి సర్కార్ అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. ఆగష్టు 15వ తేదీన కోస్తాంధ్రలో 93 క్యాంటీన్లు, రాయలసీమలో 7 క్యాంటీన్లను ఏర్పాటు చేసిన కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటం కొసమెరుపు. అయితే ఈ పథకంపై కూడా వైసీపీ టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేస్తోంది.
 
ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వంపై ఎక్కువ మొత్తంలోనే ఆర్థిక భారం పడనుందని తెలుస్తోంది. అల్పాహారం కోసం 22 రూపాయలు, భోజనం కోసం 34 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆదివారం మినహా ఏ రోజైనా అన్న క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్, భోజనం చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. అన్న క్యాంటీన్ల ద్వారా హోటళ్లలో ఎక్కువ మొత్తం ఖర్చు చేయలేని వాళ్ల ఆకలి తీరనుంది.
 
5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించడం సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న నేపథ్యంలో అన్న క్యాంటీన్ల అమలు ద్వారా పేద ప్రజలకు మేలు జరగనుందని చెప్పవచ్చు. అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు లక్ష మంది ఆకలి తీరనుందని భోగట్టా. బాబు అన్న క్యాంటీన్ల నిర్ణయం ఇతర రాష్ట్రాలకు సైతం స్పూర్తిగా నిలుస్తుంది.
 
తక్కువ మొత్తానికే ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం దొరకడం సులువైన విషయం కాదు. అయితే అన్న క్యాంటీన్ల ప్రభావం హోటళ్లపై ఎంతమేర పడుతుందో చూడాల్సి ఉంది. అన్న క్యాంటీన్ల నిర్వహణ ఏ విధంగా ఉంటుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అన్న క్యాంటీన్లను మరింత మెరుగ్గా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణ హరే రామ హరే కృష్ణ నిర్వాహకులు తీసుకున్నారు. అన్న క్యాంటీన్ల మెనూ మాత్రం బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: