ఏపీ: కేరళకు భారీ విరాళం అందించిన సర్కార్.. ఎన్ని కొట్లంటే..?

Divya
కేరళలో వయనాడ్ బాధితుల కోసం చాలామంది సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు సైతం కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం ఫండ్ రిలీజ్ నుంచి 10 కోట్ల రూపాయలు కేరళ ప్రభుత్వానికి నిన్నటి రోజున ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వయనాడ్ లో జులై 30వ తేదీన కొండ చర్యలు విరిగిన తర్వాత వరదలు ఎక్కువగా రావడంతో సుమారుగా అక్కడ 310 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా వేలమంది ప్రజలు కూడా అక్కడ ఇల్లు లేని వారిగా మారిపోయారు.

వయనాడ్ బాధితులను ఆదుకోవడం కోసం ఆయా రాష్ట్రాలు స్పందించినప్పటికీ తమకు తోచిన సహాయాన్ని సైతం చాలామంది అందించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇండియా కూటమి కూడా 10 కోట్ల రూపాయలు విరాళాన్ని అందించినట్లు తెలుస్తోంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వయనాడ్ బాధితుల కోసం అండగా నిలబడుతున్నామంటూ తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు కొన్ని కోట్ల రూపాయలను ఇచ్చారు.

దీంతో కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు కూడా పెద్ద ఎత్తున విరాళాలు రావడం జరిగింది. ఇక తమిళ సెలబ్రిటీలు కూడా తమ వంతు సహాయాన్ని సైతం చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం చేసిన ఈ సహాయం మాత్రం అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతు సహాయంగా ఏదైనా ప్రకటిస్తారేమో చూడాలి మరి. కూటమిలో భాగంగా ఇప్పటికే ఎన్నో పథకాలను సైతం అమలు చేస్తూ  ఆ వైపుగా అడుగులు వేస్తూ..ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని దాటుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పింఛన్ పెంపు అన్నా క్యాంటీన్ ఇతరత్న పథకాలను కూడా అమలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: